Home » Rajya Sabha
మాజీ బీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు(కేకే) రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి పేరు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణేతర వ్యక్తికి ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరుగుతున్నారు.
రాజ్యసభ చైర్మన్‌గా జగదీప్ ధన్‌ఖడ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించడం కోసం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రాజ్యసభలో నోటీసు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నాయి.
మహిళా సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్ నటి జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది.
రాజ్యసభలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వాకౌట్ చేయడం కలకలం సృష్టించింది.
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అయిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
Rajya Sabha Elections: రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం నాడు ఎన్నిక షెడ్యూల్‌ని విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మంగళవారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ ప్రకటన చేశారు. ఆ దేశంలో మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. వారితో ప్రభుత్వం టచ్‌లోనే ఉందని వివరించారు.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు కేంద్ర హోం శాఖ అమిత్‌షా రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ 'సభా హక్కుల నోటీసు'ను పెద్దల సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.
దేశంలోని ప్రతి రాష్ట్రంలో నమో నగర్ పేరిట హైటెక్ సిటీలు ఏర్పాటు చేయాలని బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీంతో నగరాలు పట్టణీకరణ జరగడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 185కి చేరగా, ఇంకా 225 మంది ఆచూకీ లభించలేదు. అయితే కేరళ(Kerala Landslides) విలయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) తెలిపారు.