Amit Shah: వచ్చే ఏడాది ఇదేరోజుకి నక్సల్స్‌ని ఏరేస్తాం
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:49 PM
జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదం, దేశంలో నక్సలిజంతో ఎదురవుతున్న సవాళ్లు, మాదకద్రవ్యాల బెడద, ఈశాన్య ప్రాంతంలోని సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో శుక్రవారంనాడు జరిగిన చర్చకు అమిత్‌షా సమాధానమిచ్చారు.

న్యూఢిల్లీ: అంతర్గత భద్రత పటిష్టతకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, 2026 మార్చి 21వ తేదీ నాటికి దేశంలో పూర్తిగా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదం, దేశంలో నక్సలిజంతో ఎదురవుతున్న సవాళ్లు, మాదకద్రవ్యాల బెడద, ఈశాన్య ప్రాంతంలోని సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో శుక్రవారంనాడు జరిగిన చర్చకు అమిత్‌షా సమాధానమిచ్చారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో నక్సల్స్ సమస్య నుంచి దేశానికి విముక్తి లభించనుందని చెప్పారు. 2026 మార్చి 21వ తేదీ నాటికి దేశాన్ని నక్సల్స్ బెడద నుంచి విముక్తి కల్పించడాన్ని తాము ఒక బాధ్యతగా తీసుకున్నామని చెప్పారు. నక్సలిజం ఒక రాజకీయ సమస్య మాత్రమేనని భావించే వారిని చూస్తే తనకు జాలి కలుగుతుందన్నారు.
Rahul Gandhi: అసమానత్వం, వివక్షపై నిజం నిగ్గుతేలాలి.. కులగణనపై మళ్లీ రాహుల్ వ్యాఖ్యలు
''2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన అనేక సమస్యలు దేశాభివృద్ధికి అవరోధాలుగా నిలిచాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దేశంలో అభివృద్ధి ముదుకు సాగలేదు. వీటిలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, లెఫ్టిస్ట్ ఇన్‌సర్జెన్సీ, ఈశాన్య ప్రాంతంలో చొరబాట్లు వంటివి ఉన్నాయి. ఈ మూడు అంశాలతో 92,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ మూడింటి బెడద నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది'' అని అమిత్‌షా అన్నారు. సరిహద్దులతో పాటు దేశ అంతర్గత భద్రతను పరిరక్షించేందుకు వేలాది మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలటరీ జవాన్లు ఆత్మబలిదానాలు చేశారని, వారి సేవలు మరువలేనివని చెప్పారు.
370 అధికరణ రద్దు తర్వాత..
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదంతో యువకుల ప్రమేయం దాదాపు కనుమరుగైందని చెప్పారు. పదేళ్ల క్రితం టెర్రరిస్టులు మరణిస్తే వారిని కీర్తిస్తూ అంత్యక్రియల ఊరేగింపులు జరిగేవని, ఇప్పుడు టెర్రరిస్టులు హతమైతే వారిని అక్కడికక్కడే పూడ్చిపెడుతున్నారని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనుభవిస్తూ వచ్చిన టెర్రరిస్టుల బంధువులను ఉద్యోగాల నుంచి తొలగించి గట్టి సందేశం ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, థియేటర్ల తెరిచి ఉంటున్నాయని, పెట్టుబడులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరిగిందని చెప్పారు.
ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతానికి పైగా తగ్గాయని అమిత్‌షా చెప్పారు. జి-20 సదస్సు, ముహర్రం ఊరేగింపు జరిగినట్టు వివరించారు. 2019 నుంచి 2024 వరకూ జమ్మూకశ్మీర్‌లో 40,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, 1.51 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించామని, ప్రోత్సాహకరమైన పారిశ్రామిక విధానంతో రూ.12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.1.1 లక్షల కోట్లు విలువచేసే ఎంఓయూలపై సంతాకలు జరిగాయని అమిత్‌షా వివరించారు.
ఇవి కూడా చదవండి
MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే
Read Latest National News And Telugu News