Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
ABN , Publish Date - Feb 03 , 2025 | 08:26 PM
సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ (Sonia Gandhi)పై బీజేపీ ఎంపీలు సోమవారంనాడు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు (Priviledge motion) ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జనవరి 31న పార్లమెంటు సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు.
Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్
''భారత రాష్ట్రపతికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రపతి స్థాయి, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి'' అని బీజేపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు విన్నవించారు. సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.
సోనియాగాంధీ ఏమన్నారు?
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి సుమారు గంట సేపు ప్రసంగించారు. సమావేశానంతరం మీడియాతో సోనియాగాంధీ మాట్లాడుతూ, ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలిసిపోయారని, మాట్లాడలేకపోయారని, 'పూర్ థింగ్' అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి కార్యాలయం సైతం కాంగ్రెస్ అగ్రనేతల వ్యాఖ్యలను కొట్టివేసింది. రాష్ట్రపతి ఎలాంటి అలసట లేకుండా ప్రసంగించినట్టు తెలిపింది. అయితే, సోనియాగాంధీ వ్యాఖ్యలను బీజేపీ, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఆమె వాడిన పదబంధాన్ని తప్పుగా అర్థం చేసుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు.
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
Cancer in India: దేశానికి క్యాన్సర్ సవాల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి