Home » Rajya Sabha
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక లో కాంగ్రెస్‌కు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ చీఫ్ విప్ దొద్దనగౌడ జి.పాటిల్ మంగళవారంనాడు ధ్రువీకరించారు.
కర్ణాటక నుంచి రాజ్యసభకు మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుకుంది. 3 రాజ్యసభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. బీజేపీ ఒక స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, జీసీ చంద్రశేఖర్ సైయద్ నసీస్ హుస్సేన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి నారాయణ భడంగే గెలుపొందారు.
రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
రాజ్యసభ ఎన్నికలకు ముందే సమాజ్ వాదీ పార్టీకి సోమవారం రాత్రి గట్టి దెబ్బ తగిలింది. వాస్తవానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. కానీ ఈ విందుకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha elections) మంగళవారంనాడు జరుగనున్నాయి. అదనపు సీటు కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా, ప్రధాన పోటీ మాత్రం బీజేపీ (BJP) సారథ్యంలోని ఎన్డీయే, సమాజ్‌వాదీ (SP) పార్టీ మధ్య నెలకొంది. మొత్తం 10 సీట్లలో ఎన్నికలు జరుగుతుండగా, 11 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ అనివార్యమైంది.
సమాజ్‌వాదీ పార్టీకి జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్) పార్టీ షాక్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించింది.