8 MLAs: రాజ్యసభ ఎన్నికలకు ముందే ఆ పార్టీకి షాక్.. అధినేత విందుకు హాజరు కానీ 8 మంది ఎమ్మెల్యేలు?
ABN , Publish Date - Feb 27 , 2024 | 08:04 AM
రాజ్యసభ ఎన్నికలకు ముందే సమాజ్ వాదీ పార్టీకి సోమవారం రాత్రి గట్టి దెబ్బ తగిలింది. వాస్తవానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. కానీ ఈ విందుకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాజ్యసభ ఎన్నికల(rajya sabha elections)కు ఒకరోజు ముందే సోమవారం రాత్రి సమాజ్‌వాదీ పార్టీ (SP)కి గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(akhilesh yadav) పిలిచిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఎమ్మెల్యేల గైర్హాజరీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం, ఇతర విధివిధానాల గురించి వివరించేందుకు ఎస్పీ అధ్యక్షుడు పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి పిలిచారు. ఆ క్రమంలో ఎస్పీ చీఫ్ విప్ మనోజ్ పాండే (ఉంచహార్), ముఖేష్ వర్మ (షికోహాబాద్) హాజరుకాలేదని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. దీంతోపాటు మహారాజీ దేవి (అమేథీ), పూజా పాల్ (కౌశాంబి), రాకేష్ పాండే (అంబేద్కర్ నగర్), వినోద్ చతుర్వేది (కల్పి), రాకేష్ ప్రతాప్ సింగ్ (గౌరీగంజ్), అభయ్ సింగ్ (గోసైంగంజ్) కూడా హాజరు కాలేదు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rajya Sabha elections: నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా
ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలకు మంగళవారం రాజ్యసభ ఎన్నికలు(rajya sabha elections) జరగనుండగా, మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో వారి సంఖ్యా బలం కారణంగా BJP ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టగా, సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. అయితే బిజెపి తన ఎనిమిదో అభ్యర్థిగా పారిశ్రామికవేత్త సంజయ్ సేథ్‌ను నిలబెట్టడంతో ఈ పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. బీజేపీ(BJP) ఎనిమిదో అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగితే SP తన మూడో అభ్యర్థిని గెలిపించుకోవడం కష్టమేనని అంటున్నారు.
ఈ క్రమంలో ఒక అభ్యర్థి రాజ్యసభకు చేరాలంటే 37 మొదటి ప్రాధాన్యత ఓట్లు కావాలి. సమాజ్‌వాదీ పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు ఉండగా, దాని కూటమి భాగస్వామి కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఉన్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ తన వద్దే ఉంచుకోవడంలో ఎస్పీ విఫలమైతే. మూడవ అభ్యర్థి గెలుపొందడంలో ఎస్పీ(SP) ఇబ్బంది పడవచ్చు. దీన్ని బట్టి చూస్తే విందు రాజకీయాలు అఖిలేష్‌కు ఎలాంటి ప్రత్యేక ఫలితాలను తీసుకురాలేకపోయాయని స్పష్టంగా తెలుస్తోంది.