Rajya sabha Elections: కర్ణాటకలో 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్, బీజేపీకి ఒకటి
ABN , Publish Date - Feb 27 , 2024 | 07:35 PM
కర్ణాటక నుంచి రాజ్యసభకు మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుకుంది. 3 రాజ్యసభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. బీజేపీ ఒక స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, జీసీ చంద్రశేఖర్ సైయద్ నసీస్ హుస్సేన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి నారాయణ భడంగే గెలుపొందారు.
కర్ణాటక: కర్ణాటక (Karnataka) నుంచి రాజ్యసభ(Rajya sabha)కు మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ (Congress) సత్తా చాటుకుంది. 3 రాజ్యసభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. బీజేపీ (BJP) ఒక స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, జీసీ చంద్రశేఖర్ సైయద్ నసీస్ హుస్సేన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అజయ్ మాకెన్‌కు 47 ఓట్లు రాగా, జీసీ చంద్రశేఖర్, సైయద్ హుస్సేన్‌లు చెరో 46 ఓట్లు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నారాయణ భడంగే కూడా గెలుపొందారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు మొత్తం నాలుగు స్థానాల్లో ఎన్నికలు జరుగగా, జేడీ(ఎస్) అభ్యర్థిగా డి.కుపేంద్ర రెడ్డితో సహా ఐదుగురు పోటీ చేశారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటు వేశారు. మరో ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్ ఓటింగ్‌లో పాల్గొనలేదు.