Rammohan Naidu: టీడీపీలో వారికి సముచిత స్థానం.. రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:05 PM
Rammohan Naidu: తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లితో సమానమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్ఘాటించారు. తమ కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించింది టీడీపీ మాత్రమేనని స్పష్టంచేశారు.

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని.. కూటమి ప్రభుత్వ ఆలోచనలు ప్రజలకు వివరించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం చంద్రబాబు టీడీపీలో సముచిత స్థానం కల్పించారని ఉద్ఘాటించారు. దేశంలో చరిత్రలో నిలిచిపోయేలా కోటి మంది సభ్యత్వాలతో నడుస్తున్నది అంటే దానికి కారణం యువనేత లోకేష్ అని తెలిపారు.
దేశ చరిత్రలో ఎన్నో పార్టీ వచ్చాయని.. పోయాయి కానీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీ టీడీపీ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లితో సమానమని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చంద్రబాబు ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఉద్ఘాటించారు. టీడీపీ అడ్రస్‌ను సవాల్ చేసిన వ్యక్తులే ప్రస్తుతం చరిత్రలో అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. తమ కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించింది టీడీపీ మాత్రమేనని స్పష్టంచేశారు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ రథసారథులని... వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
జాతీయ రాజకీయాల్లో టీడీపీది కీలక పాత్ర: లావు శ్రీకృష్ణదేవరాయలు
ఒక ప్రాంతీయ పార్టీగా ఎన్నో విజయాలు సాధించి.. జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. తెలుగువారికి జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ గుర్తింపు తెచ్చిందని చెప్పారు. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని అన్నారు.
ఒక ప్రాంతీయ పార్టీలో కోటిమంది సభ్యత్వాలు తీసుకోవడం సామాన్యమైన విషయం కాదన్నారు. కార్యకర్తలకు కేవలం టీడీపీ పార్టీలో మాత్రమే గుర్తింపు లభిస్తుందని తెలిపారు.రాబోయే కాలంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి కష్టపడి పనిచేయాలని సూచించారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని... దానికోసం కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..
Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...
For More AP News and Telugu News