Home » Rammohannaidu Kinjarapu
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మోదీ రికార్డు స్థాయిలో 3వ సారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమానం చేశారు. ఇక మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది.
ఢిల్లీలో ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉల్లాసంగా జరిగింది. ఈ సారి మంత్రి వర్గంలో అందరి చూపు ఒకరిపై ఉంది. ఆయన మరెవరో కాదు ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu Kinjarapu).
విశాఖ: కేంద్రమంత్రులుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu), గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (MP Pemmasani Chandrasekhar).. ఢిల్లీలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో వారిపై టీడీపీ, జనసేన, భాజపా కూటమి నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...
మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో (BC Declaration Event) ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (CM YS Jagan Mohan Reddy) టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రూ. 74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ (BC Subplan) నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపణలు గుప్పించారు.
శ్రీకాకుళం జిల్లా: ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్ మాయ మాటలు చెప్పారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.
AP Politics: అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...