Share News

Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్.. కారణమిదే

ABN , Publish Date - Oct 29 , 2024 | 12:53 PM

Andhrapradesh: విమాన టికెట్ల ధరలపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని.. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని అన్నారు.

Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్.. కారణమిదే
CPI Leader Narayana

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) ఫైర్ అయ్యారు. టికెట్ ధరలకు సంబంధించి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు (Union Minister Rammohan Naidu) నారాయణ లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిపిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. ప్రయాణ దూరం మారనప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ప్రజలను లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్థల వివాదం


ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తోంది....

భారత్ దేశ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ టికెట్ ధరలు నిర్ణయించాలని సూచించారు. విమానయాన టికెట్ల రేట్లపై నియంత్రణ ఉండాలన్నారు. విమానయాన శాఖ ప్రజల కోసం పని చేయాలన్నారు. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని వెల్లడించారు. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. విమానయాన సంస్థలకు బాంబు బెదరింపులు వస్తుంటే ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సైకలాజికల్ టెర్రర్‌కు గురి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇంటెలిజెన్స్ వైఫల్యమంటూ విరుచుకుపడ్డారు. విమానయాన సంస్థలు టికెట్లు ధరలను నియంత్రించకపోతే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుందన్నారు. ప్రపంచంలో హంగర్ ఇండియా 112 వ స్థానంలో ఉందన్నారు. ట్రైన్‌లో కూడా వందే భారత్ పేరిట టికెట్ల రేట్లు పెంచారని నారాయణ పేర్కొన్నారు.

ప్రాణాలు తీసిన దాగుడుమూతలు


ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

కాగా.. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారం వ్యవధిలోనే ఎన్నో బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. నాలుగు రోజు క్రితం కూడా ఎయిర్‌పోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబ్ పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానయాన సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులు కిందకు దింపి చెక్ చేశారు. అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వారం వ్యవధిలో వచ్చిన బాంబు బెదిరింపులపై దాదాపు ఐదు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఇదే రోజు దేశ్యాప్తంగా మొత్తం 20 విమానాలకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

Kollu Ravindra: మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్థల వివాదం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2024 | 04:42 PM