Rammohan Naidu: సిట్టు గిట్టు లేదనడం ఎంతవరకు సంస్కారం
ABN , Publish Date - Oct 05 , 2024 | 10:42 AM
Andhrapradesh: సిట్ అంటే ఎందుకంత భయమని జగన్‌ను ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని భావించామని.. కానీ సిట్ లేదు గిట్ లేదని పలుచన చేయడం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు.
తిరుపతి, అక్టోబర్ 5: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ పర్యవేక్షణలో సిట్ (SIT) వేయడంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మండిపడ్డారు. శనివారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిట్ అంటే ఎందుకంత భయమని జగన్‌ను ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని భావించామని.. కానీ సిట్ లేదు గిట్ లేదని పలుచన చేయడం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు. విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
Tirumala: తిరుమలలో గోవింద నామాలే వినిపించాలి: సీఎం చంద్రబాబు
కాగా... తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని ఈరోజు (శనివారం) కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో దేశంలో 75 విమానాశ్రయాలు ఉండేవని.. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 156కు పెంచారన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో స్థలాన్ని పరిశీలించి నూతన ఎయిర్ పోర్ట్‌లకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు పనిచేస్తానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!
ఇంతకీ జగన్ ఏమన్నారంటే..
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ నిన్న(శుక్రవారం) మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ‘‘తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిందనేది అబద్ధం. ఈ విషయం చెప్పడానికి సిట్టూ అవసరం లేదు.. బిట్టూ అవసరం లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆయన వేసిన సిట్‌ను రద్దు చేసింది. లడ్డూ వ్యవహారంలో అసలేం జరగలేదని కంటికి క్లియర్‌గా కనిపిస్తోంది. అయినా, ఏదో జరిగిందని వీళ్లంద రూ ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ జరగలేద ని మేం చెబుతున్నాం. దానికి ఆధారాలూ చూపిస్తున్నాం. అయినా, ఎవరైనా వచ్చి(సీబీఐ సిట్ ) కొత్తగా ఇంకా ఏమి చేస్తారు.రాజకీయ స్వార్థం కోసం వీళ్లు(సిట్ అధికారు లు) ఒక తప్పుడు రిపోర్టు తయారుచేసి, ప్రచారంలో పెడితే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది. స్వామికి కోపం వస్తే మామూలుగా ఉండదు. అయితే, ఆయన తన కోపాన్ని చంద్రబాబు, కూటమి నేతలు, ఆయనను సమర్థిస్తూ మాట్లాడేవారిపైనా, అబద్ధాలను రెక్కలు కట్టుకుని ప్రచారం చేస్తున్నవారిపైనా మాత్రమే చూపాలి’’ అని జగన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad: 824 నివాసాలు.. 149 కూల్చివేతలు...
రూ.100 కోట్లకు మరో దావా వేస్తా
Read Latest AP News And Telugu News