Home » Rayachoty
కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువులను ఎవరో ఒకరికి ఆన్లైన్ చేయడం చూశాం.. అయితే డబ్బు వేటలో బరి తెగించిన ఇద్దరు తహసీల్దార్లు తాము ఎంతో బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్నామన్న సంగతి పక్కన పెట్టేసి.. సుమారు 50 సంవత్సరాలుగా ప్రజలు నివాసం ఉంటున్న పల్లెను ఓ వైసీపీ నాయకుడికి ఆన్లైన్ చేసేశారు.
ల్లా రెవెన్యూ శాఖలో ఆయనో పెద్ద సార్.. పెద్ద సార్ అంటే.. మరీ అంత పెద్ద సార్ కాదు కానీ.. మొత్తానికి పెద్దసారే.. ఆయన.. తన స్థాయికి తగ్గట్టు వసూళ్లు కూడా పెద్దగానే చేస్తున్నారు. ఎంత పెద్దగా అంటే జిల్లా వ్యాప్తంగా ఈ వసూళ్లు చేయడానికి ముగ్గురు బ్రోకర్లను పెట్టుకునేంత. ఈ బ్రోకర్లు సార్ చేతికి మట్టి అంటకుండా అంతా తామే చూసుకుంటారు.
రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
ఆయనో జిల్లా అధికారి.. మామూళ్లు.. లంచాలు వసూలు చేయడంలో ఆయన దిట్టగా పేరుగాంచారు. అర్హతతో సంబంధం లేకుండా లక్ష రూపాయలు లంచం ఇచ్చిన వాళ్లకు ఏఈ (ఎంఐసీ) పోస్టులు అమ్ముకుంటున్నాడు. నెలనెలా తనకు ఇచ్చే మామూళ్లను తన కింద పని చేసే అటెండర్లు, కంప్యూటర్ ఆఫరేటర్ల ఫోన్‌పే నెంబర్లకు వేయించుకుంటాడు.
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
వేసవిని తలపించేలా భగభగ మండుతున్న ఎండలు... అప్పడప్పుడు మేఘాలు కమ్ముకుంటున్నా వర్షం జాడ లేక.. రోజురోజుకు భూగర్జజలాలు పాతాళానికి పడిపోయాయి.
ఒమన దేశంలో తమ తల్లి ఇబ్బందులు పడుతోందని, వెంటనే ఇండియాకు రప్పించాలని బాధితురాలి పిల్లలు, భర్త ఎస్పీని కోరడంతో వెంటనే స్పందించిన ఆయన 24 గంటల్లోనే ఆ మహిళను స్వదేశానికి రప్పించారు. వివరాలిలా ఉన్నాయి.
ఈనెల 17 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు స్వచ్ఛ తాహీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన అధికారులను ఆదేశిం చారు.
విజ్ఞానాభివృద్ధికి గురువు పునాదిలాంటివారని, నా ఉన్నతికి దోహదపడింది కూడా గురువులేనని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని లయ గార్డెన్స్‌లో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవ) వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు.