Share News

Swachhtahiseva జిల్లాలో స్వచ్ఛతాహిసేవా కార్యక్రమాలు : జేసీ

ABN , Publish Date - Sep 13 , 2024 | 11:36 PM

ఈనెల 17 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు స్వచ్ఛ తాహీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన అధికారులను ఆదేశిం చారు.

Swachhtahiseva జిల్లాలో స్వచ్ఛతాహిసేవా కార్యక్రమాలు : జేసీ
స్వచ్ఛతాహిసేవ పోస్టర్‌ను ఆవిస్కరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శరాజేంద్రన

రాయచోటి (కలెక్టరేట్‌) సెప్టంబరు 13: ఈనెల 17 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు స్వచ్ఛ తాహీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి డివిజన, మండలస్థాయి అధికారులు, మున్సిపల్‌, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫ రెన్స నిర్వహించారు. కార్యక్రమానికి డీఅర్‌ఓ సత్యనారాయణ, వివిధ జిల్లాల అధికారులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆక్టోబర్‌ 2 నుంచి స్వచ్ఛభారత దివస్‌ నిర్వహిం చనన్న నేపధ్యంలో ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సి పాలిటీలు, పంచాయతీలలో ఈ కార్యక్రమం నిర్వ హించాలని ఆదేశించారు. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అధికారులందరు సమ న్వయంతో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుబ్రతపై మానవహరం, ర్వాలీలు, మారథనరన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాల యాలలో, విద్యాసంస్థలలో ప్రతిజ్ఞ పాటించి శ్రమ దానం నిర్వహించాలన్నారు. ముఖ్యంగా గ్రామా లలో రోడ్లు, చెత్తకుప్పలు, బోరుబావుల చుట్టు పక్కల శుభ్రంగా వుండేలా ఒక డ్రైవ్‌ నిర్వహిం చాలన్నారు. ఎంపీడీఓలు, ఈఓఅర్‌డీలు, అర్‌డ బ్ల్యూఎస్‌ అధికారులు, కార్యదర్శులు దృష్టి సారిం చాలన్నారు. అలాగే గ్రామలలో పెద్ద ఎత్తు న మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమం అనంతరం స్వచ్ఛతాహి సేవ ప్రచా రం పోస్టర్లను జాయింట్‌ కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ, డీఅర్‌డీఏ, అర్‌డబ్ల్యు ఎస్‌, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 11:36 PM