Teachers : విజ్ఞానాభివృద్ధికి పునాది గురువు
ABN , Publish Date - Sep 05 , 2024 | 11:17 PM
విజ్ఞానాభివృద్ధికి గురువు పునాదిలాంటివారని, నా ఉన్నతికి దోహదపడింది కూడా గురువులేనని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని లయ గార్డెన్స్‌లో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవ) వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే
కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
రాయచోటిటౌన్, సెప్టెంబరు 5: విజ్ఞానాభివృద్ధికి గురువు పునాదిలాంటివారని, నా ఉన్నతికి దోహదపడింది కూడా గురువులేనని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని లయ గార్డెన్స్‌లో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, డీఈవో శివప్రకాశ్‌రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పురాతన కాలం నుంచి సమాజంలో గురువును స్మరిస్తూ వారి ప్రాముఖ్యతను, విద్య పూర్తయిన తర్వాత గురువును సత్కరించే చక్కని సంస్కారం కలిగిన సమాజం మనది అన్నారు. నేను ఈ రోజు జిల్లా కలెక్టర్‌గా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం నా తల్లిదండ్రులతో పాటు నాకు విద్య నేర్పిన గురువులే మూలం అన్నారు. ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ స్థాయికి నేను రావడానికి నా గురువులే కారణమని, నాకు విద్య నేర్పిన గురువులందరికీ ఈ శుభసమయాన పాధాభివందనాలు చేస్తున్నానన్నారు. 21వ శతాబ్దంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ముందుకు వెళ్తున్నామని, నేటి తరం విద్యార్థులకు అవసరమైన డిజిటల్ లెర్నింగ్, నూతన టెక్నాలజీల పట్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు నిరంతరం వారి నైపుణ్యాలను పెంపొందించుకుని వాటిని విద్యార్థులకు అందించడం చాలా అవసరమని ఆయన సూచించారు. విద్యార్థుల ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులందరూ భావిభారత నవసమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎంతో అత్యున్నత పదవిలో ఉన్న వారైనా ఉపాధ్యాయుల గొప్పదనాన్ని గురైరిగి గౌరవిచడం మన సంస్కృతి అన్నారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 81 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను కలెక్టర్ చామకూరి శ్రీధర్‌తో పాటు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, నోబెల్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర బాధ్యులు కొండూరు శ్రీనివాసరాజు, పీఈటీల అసోషియేషన్ నేతలు నరసరాజు, రెడ్డెయ్య, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా బాధ్యులు మడితాటి నరసింహారెడ్డి, జిల్లా అధికారులు, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వీరే
గురుపూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు అందుకున్న వారిలో 81 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో జ్యోతిర్మయి (ప్రిన్సిపాల్, రాయచోటి డైట్), సుబ్బారెడ్డి (హెచ్‌ఎం, జడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె), రవీంద్రనాయక్ (ఎంఈవో-2, సుండుపల్లె), నటరాజన్ (హెచ్‌ఎం, పీలేరు ప్రభుత్వ పాఠశాల), చంద్రకళ (హెచ్‌ఎం, జడ్పీహెచ్‌ఎస్, దేవళచెరువు), లక్ష్మిదేవి (హెచ్‌ఎం, చెర్లోపల్లె, రాజంపేట), క్రిష్ణయ్య (చెన్నముక్కపల్లె, రాజంపేట), అన్సర్‌బాషా (జడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె), భాస్కర్‌రెడ్డి (జడ్పీహెచ్‌ఎస్, బి.కొత్తకోట), దేవకమ్మ (జడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె), జయచంద్రయ్య (మట్లిపెద్దూరు, వీరబల్లి), రెడ్డెయ్య (నీలకంట్రావుపేట హైస్కూల్), రాజునాయక్ (ఓబులవారిపల్లె హైస్కూల్), స్లీవమ్మ (రాజంపేట ఎంపీపీఎస్), పార్థసారధి (వత్తలూరు జడ్పీ హైస్కూల్), జయప్రకాశ్ (కొత్తమంచూరు హైస్కూల్, వాల్మీకిపురం), దేవప్రసాదురెడ్డి (సంబేపల్లె హైస్కూల్), వెంకటరమణనాయక్ (పీలేరు కొత్తపల్లె హైస్కూల్), హేమలత (రామసముద్రం ఎంపీపీ స్కూల్), రమణయ్య (గరుగుపల్లె హైస్కూల్, రాయచోటి) అవార్డులు అందుకున్నారు.
అలాగే రామలింగారెడ్డి (మోటకట్ల హైస్కూల్, సంబేపల్లె) బుక్కె లలిత (రాయయుడు కాలనీ యూపీ స్కూల్, రాయచోటి), ప్రసాదు (నడిపిచెర్ల హైస్కూల్), మాధురి (రైల్వేకోడూరు హైస్కూల్), నాగేంద్రబాబు (సుండుపల్లె హైస్కూల్), కమాల్‌బాషా (బురకాయలకోట హైస్కూల్), మల్లేశ్వరి (అడివికమ్మపల్లె హైస్కూల్), రమే్‌షబాబు (గొర్లముదివీడు హైస్కూల్), వెంకటరమణరాజు (బోయినపల్లె హైస్కూల్), అత్విక్ కరీమాన్ (మడితాడు హైస్కూల్), మురళీకుమార్ (పెద్దజంగంపల్లె హైస్కూల్), సుధాకర్ (మల్లెల యూపీ స్కూల్, పీటీఎం), శోభారాణి (బండపల్లె యూపీ స్కూల్), షపీవుల్లాబాషా (లక్కిరెడ్డిపల్లె ఉర్దూ హైస్కూల్), రామాంజనేయులురెడ్డి (గుంతరాచపల్లె హైస్కూల్), అరుణకుమారి (వెంకటరాజుపల్లె హైస్కూల్), బుక్కె విజయాబాయి (మహబూబ్‌నగర్ ఉర్దూ యూపీ స్కూల్, రాయచోటి), రామయ్య (కోడూరు హైస్కూల్), విజయవర్మ (కోడూరు హైస్కూల్), వీరాంజనేయులు (చాకిబండి హైస్కూల్), నాగరాజునాయక్ (సుండుపల్లె హైస్కూల్), ఓబులేసు (మన్నూరు హైస్కూల్), కృపాకర్‌నాయుడు (రెడ్డివారిపల్లె హైస్కూల్), శ్రీనివాసవర్మ (ఆకేపాడు హైస్కూల్) అవార్డులు అందుకున్నారు.
అలాగే భారతి (మదనపల్లె హైస్కూల్), ఫణీంద్ర (మదనపల్లె హైస్కూల్), రాణికుమారి (సరస్వతిపల్లె ఎంపీపీ స్కూల్), పురుషోత్తం (అనంతరాజుపేట ఎంపీపీ స్కూల్), రెడ్డెయ్యరాజు (సంబేపల్లె ఎంపీపీ స్కూల్), ఉమామహేశ్వర్ (ఆర్ ఉప్పర్‌పల్లె ఎంపీపీ స్కూల్), రాధాక్రిష్ణయ్య (తిప్పాయపల్లె ఎంపీపీ స్కూల్), మక్తార్ అహ్మద్ (తరిగొండ యూపీ స్కూల్), రఫీక్‌ఖాన్ (శిబ్యాల ఎంపీపీ స్కూల్), మల్లికార్జున (మద్దేలవాండ్లపల్లె ఎంపీపీ స్కూల్), పల్లం ఉమాదేవి (నల్లపరెడ్డిపల్లె ఎంపీపీ స్కూల్), షేక్ అంజాద్‌బాషా (సిద్దారెడ్డిగారిపల్లె ఎంపీపీ స్కూల్), మనోహర్ (ఓబుల్‌రెడ్డిగారిపల్లె ఎంపీపీ స్కూల్), మూడే సిద్దునాయక్ (సుండుపల్లె ఎంపీపీ స్కూల్), అంజనమ్మ (గొరికుంటపల్లె ఎంపీపీ స్కూల్), పిచ్చిరెడ్డి చీకటివాండ్లపల్లె ఎంపీపీ స్కూల్), అమృతవళ్లి (సరస్వతిపల్లె ఎంపీపీ స్కూల్), వెంకటేశ్వర్లు (వేములవాండ్లపల్లె ఎంపీపీ స్కూల్), వెంకటసుబ్బమ్మ (సీతారామపురం ఎంపీపీ స్కూల్), నూరేమోహిన్ (రాయుడుకాలనీ ఉర్దూ యూపీ స్కూల్), మనోహర (గంగరాజుపోడు యూపీ స్కూల్), నాగేశ్వరగౌడ్ (బోయినపల్లె ఎంపీపీ స్కూల్), మల్లికాబేగం (మార్కెట్ ఉర్దూ హైస్కూల్), శ్రీనివాసులు (టేకులపాలెం స్కూల్, మదనపల్లె), రామక్రిష్ణ (వడ్డెపల్లె ఎంపీపీ స్కూల్), అజ్‌మీర్‌భాను (నూలివీడు ఎంపీపీ ఉర్దూ స్కూల్), సయ్యద్ కమాల్‌బాష (బలిజపల్లె ఎంపీపీ స్కూల్), శ్రీనివాసులు (గౌరివారిపల్లె ఎంపీపీ స్కూల్), శ్రీరాములు (మేదరపల్లె ఎంపీపీ స్కూల్), వెంకటరమణ (వివికండ్రీక, ఎంపీపీ స్కూల్), నీలకంఠయ్య (మేడికూర్తి ఎంపీపీ స్కూల్), నాగభూషణంరెడ్డి (సరస్వతిపల్లె ఎంపీపీ స్కూల్), వసుందరాదేవి (నీలకంఠరావుపేట హైస్కూల్), రాజా (రాయచోటి ప్రభుత్వ పాఠశాల), నాగరాజన్ (రామసముద్రం ఏపీఎంఎ్‌స), రమీజా (రామాపురం కేజీబీవీ), శివలక్ష్మి (గాలివీడు బాలుర హైస్కూల్) ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు.