Home » Republic day
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పరేడ్ గ్రౌండ్స్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే పబ్లిక్ గార్డెన్స్లో కూడా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించే శకటాల ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతుందో మీకు తెలుసా. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. అయితే ఆ రోజు అన్ని రాష్ట్రాల శకటాలకు అనుమతి లభించదు. పరేడ్ లో శకటాల(parade tableaux) ప్రదర్శనకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రత్యేక టీం వీటిని ఎంపిక చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళలు రిపబ్లిక్ డే వేడుకలకు అటెండ్ అవుతారు. వారిలో ఒకరు స్వీపర్ నారాయణమ్మ కాగా మరొకరు మొబైల్ షీ టాయిలెట్ నిర్వాహకురాలు నాగలక్ష్మీ. వీరిద్దరిని రిపబ్లిక్ డే వేడుకల కోసం జీహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఢిల్లీ పంపించారు.
యావత్ భారతావని గణతంత్ర వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఢిల్లీలో జరగనున్న వార్షిక వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులపాటు జరుగుతాయి.
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలోని11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక జాతినుద్దేశించి ఆమె ప్రసంగించడం ఇది రెండోసారి.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం అని, జనవరి 26న గణతంత్ర దినోత్సవం అని మనందరికీ తెలిసిందే. రెండు పండుగలప్పుడూ మనం చేసే పని.. జెండా ఎగరేయడం.
వరంగల్ కు చెందిన కూచిపూడి నర్తకి పెండ్యాల లక్ష్మీ ప్రియ రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. ఈ నెల 22 వతేదీన విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించారు.
రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.