Republic Day: పోలీస్ పహారాలో గణతంత్ర వేడుకలకు ముస్తాబైన దిల్లీ..
ABN , Publish Date - Jan 25 , 2024 | 11:00 AM
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలోని11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలోని11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. దిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా స్వయంగా నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. భద్రత దృష్ట్యా దేశ రాజధాని దిల్లీని కంటోన్మెంట్‌గా మార్చారు. పరేడ్ నిర్వహించే ప్రాంతాన్ని 11 జోన్‌లుగా విభజించారు. ఒక్కో జోన్ బాధ్యతను ఒక్కో డీసీపీకి అప్పగించారు. ఒక్కో డీసీపీ వద్ద ఇద్దరు ఏసీపీలు లేదా అదనపు డీసీపీలు, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. గణతంత్ర దినోత్సవం రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే అన్ని జిల్లాలను అప్రమత్తం చేశామని స్పెషల్ సీపీ లా అండ్ ఆర్డర్ మధుప్ తివారీ తెలిపారు. ముఖ్యంగా న్యూదిల్లీ జిల్లాలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మిస్సింగ్ పర్సన్ బూత్, హెల్ప్ డెస్క్‌తో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు. గస్తీ బృందాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రెండో షిప్టులో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేయనున్నాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.