Home » Reservations
రిజర్వేషన్ల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. రిజర్వేషన్లకు స్వస్తి చెప్పేందుకు బీజేపీ ఒక్కనాటికి అనుమతించదని, కాంగ్రెస్ ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ రాజకీయాల్లో ఉన్నంత వరకూ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది రాదని, కాంగ్రెస్ ఆ పని చేసినా అనుమతించేది లేదని అన్నారు.
మరాఠా రిజర్వేషన్ల వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వానికి మరాఠా రిజర్వేషన్ పోరాట నేత మనోజ్ జారంగే అల్టిమేటం ఇచ్చారు. మరాఠా రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించకుంటే జూన్ 4వ తేదీ నుంచి మరోసారి తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మరాఠా కోటా ఆందోళనలకు సారథ్యం వహించిన ఉద్యమ నేత మనోజ్ జారంగేపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లను దిగ్బంధించాలంటూ ప్రజలను ఆయన రెచ్చగొట్టారని షిరూర్, అమల్నేర్ పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేశారు.
మరాఠా కమ్యూనిటీకి రెండు క్యాటగిరిల కింద రిజర్వేషన్ పొందే ఛాయెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జారంగే పాటిల్ ) అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము డిమాండ్ చేసింది ఒకటయితే, ప్రభుత్వం ఇస్తామన్నది మరొకటి అని ఆయన బుధవారంనాడు చెప్పారు. ఈనెల 24 నుంచి మళ్లీ తాజా ఆందోళనలు మొదలుపెడతామని ప్రకటించారు.
మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యాగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సభలో ప్రవేశపెట్టారు.
మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల అంశం మళ్లీ వేడెక్కుతోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక తీర్మానం చేయాలని మఠాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శుక్రవారంనాడిక్కడ డిమాండ్ చేశారు. రాత్రిలోగా తమ డిమాండ్లు నెరవేరకుంటే శనివారం ఉదయం ముంబై వైపు కదులుతామని హెచ్చరించారు.
మరాఠా రిజర్వేషన్ వివాదం మరింత ఉధృతం చేసేందుకు రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే నిర్ణయించారు. ఈనెల 26 నుంచి ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో కానీ, శివాజీ పార్క్ గ్రౌండ్లో కానీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. జనవరి 20న అంతర్వాలీ సరాతీ గ్రామం నుంచి పాదయాత్రగా ముంబై చేరుకుంటామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి బీహార్ ప్రభుత్వం లాంఛనంగా పెంచింది. పెంచిన కోటాకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు.
బీహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
మరాఠా రిజర్వేషన్ పోరాట కార్యకర్త మనోజ్ జారంగే తమ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారంనాడు హెచ్చరించారు. మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పక్షంలో అక్టోబర్ 24 నుంచి తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయనున్నట్టు ప్రకటించారు.