Share News

Karnataka: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు... పోస్ట్ డిలీట్ చేసిన సీఎం

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:40 PM

కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెంటనే ఆ పోస్ట్‌ను సీఎం తొలగించారు.

Karnataka: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు... పోస్ట్ డిలీట్ చేసిన సీఎం

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ల (Reservaitons)పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెంటనే ఆ పోస్ట్‌ను సీఎం తొలగించారు.


కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వరేషన్లకు వీలు కల్పించే బిల్లకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక మంత్రివర్గం గత సోమవారం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ ఆమోదాన్ని సిద్ధరామయ్య 'ఎక్స్' వేదికగా వివరించారు. ''సొంత రాష్ట్రంలో కన్నడిగులు ఎవరూ ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే మా ప్రభుత్వ ఆకాంక్ష. రాష్ట్ర వాసులు సుఖవంతమైన జీవితం గడిపేలా అవకాశాలు కల్పించాలని మా కోరిక. కన్నడిగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాది కన్నడిగుల అనుకూల ప్రభుత్వం. ఆ దిశగా రాష్ట్రంలో నెలకొల్పిన అన్ని ప్రైవేటు పరిశ్రమలో సీ,డీ గ్రేడ్ పోస్టుల్లో 100 శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేసే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది'' అని ఆయన తెలిపారు. కాగా, క్యాబినెట్ నిర్ణయంపై పారిశ్రామిక వేత్తల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఆ పోస్ట్‌ను సిద్ధరామయ్య తొలగించారు.


కార్మిక మంత్రిత్వ శాఖ వివరణ

సిద్ధరామయ్య పోస్టుపై కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ ఎస్ లాడ్ బుధవారంనాడు వివరణ ఇచ్చారు. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేటిమెంట్ కోటాలో 70 శాతం, మేనేజిమెంట్‌ కోటాలో 50 శాతం పోస్టులను కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్టు తెలిపారు. అలాంటి స్కిల్స్ లేనప్పుడు ఔట్ సోర్సింగ్‌ను తీసుకోవచ్చని అన్నారు. అయితే స్థానికంగా అలాంటి నైపుణ్యాలు ఉన్నప్పుడు వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చూసేందుకు ‌చట్టం తేవాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందన్నారు. ''కర్ణాటక స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్-2024''ను న్యాయశాఖ గురువారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

Kanwar Yatra 2024: కన్వర్ యాత్రకు భారీ భద్రత.. డ్రోన్లతో నిఘా


పారిశ్రామిక వర్గాల్లో వ్యతిరేకత

కాగా, ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు‌ కల్పించాలనే క్యాబినెట్ నిర్ణయం 'ఫాసిస్ట్' చర్య అని, రాజ్యాంగవిరుద్ధమని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. ఇది పూర్తిగా వివక్షాపూరితమైందని, వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ప్రైవేటు సెక్టార్‌లోని రిక్రూట్‌మెంట్ బోర్డులో ప్రభుత్వాధికారి జోక్యం చేసుకుంటారా? అని ప్రశ్నించారు.


సాంకేతికరంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లును అనుమతించకూడదని బయాకాన్ లిమెటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అభిప్రాయం వ్యక్తం చేసారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు. టెక్ హబ్‌గా తమకు నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని, స్థానికులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తీసుకుంటే టెక్నాలజీరంగంలో లీడింగ్ పొజిషన్‌పై ప్రభావం పడుతుందన్నారు. ఇది హస్వదృష్టి కలిగిన బిల్లు అని కర్ణాటక అసోచామ్ కో-చైర్మన్ ఆర్ఎం మిశ్రా అన్నారు. ప్రతి ప్రైవేటు కంపెనీలోనూ ప్రభుత్వ అధికారిని నియమిస్తే కంపెనీలు ఇండియన్ ఐడీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు బెంబేలెత్తుతాయని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jul 17 , 2024 | 04:40 PM