Home » Rushikonda
కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ ఇంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంజాయిషీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
కుటుంబం కోసం జల్సా మహల్‌ను కట్టుకున్న జగన్, దానికి సంబంధించిన ఖరీదైన ‘పనుల’ను తన సమీప బంధువుకే అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వెనుక మరెన్నో విషయాలు దాగున్నాయని, ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రుషికొండ ప్యాలె్‌సకు ఎంత ఖర్చు చేశారు..
విశాఖలో రుషికొండ రాజభవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టారు. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రభుత్వం, ప్రజలు జగన్ చేసిన చర్యలను తప్పుబడుతున్నారు.
రుషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహల్ గుట్టును ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి, నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్‌లోని హంగులను ‘జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్’ పేరిట 13-10-2023 సంచికలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది.
ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురమంటూ సీఎంగా ఉండగా జగన్ ఆర్భాటం చేశారు. కానీ, ఇదేదో సాదాసీదా కాపురం కాదు... రూ.500 కోట్లతో రుషికొండపై కట్టుకున్న ప్యాలెస్‌లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. ఫైవ్‌స్టార్ హోటల్, సీఎం క్యాంప్ ఆఫీస్, టూరిజం ప్రాజెక్ట్, ఫేజ్ 1, 2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు.
రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాలస్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..
Andhrapradesh: రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్‌ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు.
ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్‌గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలనా రాజధాని నిర్ణయం మేరకు రుషికొండ నిర్మాణాలను.. త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందన్నారు.