Paragliding : విశాఖలో పారాగ్లైడింగ్
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:35 AM
విశాఖ నగరాన్ని సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు రుషికొండ బీచ్‌లో పారాగ్లైడింగ్ అందుబాటులోకి రానుంది.
విజయవంతమైన ట్రయల్‌రన్
సాగర్‌నగర్ (విశాఖపట్నం), డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరాన్ని సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు రుషికొండ బీచ్‌లో పారాగ్లైడింగ్ అందుబాటులోకి రానుంది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో లెవెన్ అడ్వెంచర్స్ సంస్థ ఆదివారం నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఈ బీచ్‌లో ఇప్పటికే బోటుషికార్, స్కూబా డైవింగ్ తదితర అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అందుబాటులో వున్నాయి. పారాగ్లైడింగ్ కొత్త అనుభూతిని అందించనుంది. నింగి, నేలను తాకుతూ సముద్రంలో ఎగసిపడే కెరటాలు... మరో పక్క ఎత్తైన కొండలను వీక్షిస్తూ నీలాకాశంలో విహరించడం పర్యాటకులకు మధురానుభూతినిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.