Share News

Rushikonda.. అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట: విష్ణుకుమార్ రాజు

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:28 PM

రుషికొండ రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు.

Rushikonda.. అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట: విష్ణుకుమార్ రాజు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది (Question time continues). ఈ సందర్బంగా విశాఖలో రుషికొండపై (Rushikonda) జగన్ (Jagan) నిర్మించిన ప్యాలెస్‌పై అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) మాట్లాడుతూ.. రుషికొండపై నిర్మాణాలకు రూ. 409 కోట్లు కేటాయించారని, ఈ నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట అని అన్నారు. అక్కడకు ఎవరిని వెళ్లనీవ్వకుండా అడ్డుకున్నారని, మేము ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద నెల తరువాత సమాధానం వచ్చిందన్నారు.

రుషికొండ రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 28 వేల 096 రూపాయలు ఖర్చు అయిందని, ఇంత ఖర్చు పెట్టీ పేదలకు, పెద్దలకు పోరాటం అని పేర్కొంటూ జగన్ బిల్డ్ అప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రూ. 409 కోట్ల వ్యయం చేస్తే 22 వేల 743 మందికి పేదలకు ఇల్లు కట్టవచ్చునని అన్నారు. నిర్మాణాలకు ఖర్చు చదరపు అడుగు 24 వేల రూపాయలకు నిర్మించారని, ఫర్నిచర్ ఖరీదు రూ. 22 కోట్లు వ్యయం చేశారన్నారు. ముందు టూరిజం రిసార్ట్ అని చెప్పి ఆ తరువాత జీవో ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్‌ను వెతికేందుకు ఒక కమిటీ వేసి రుషికొండ ప్యాలెస్‌ను సిఎంకు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసిందని, బాత్ రూంలో కమ్ ఔట్ ఖరీదు రూ. 16 లక్షలు అంట అని విష్ణుకుమార్ రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ఆయన కమ్ ఔట్‌కు రూ.11 లక్షలు ఖర్చు అయిందని, ఈ కమ్ ఔట్‌లో స్పెషాలిటీ ఏమిటి అని అడిగితే ఆటో వాషింగ్ అని చెప్పారని, నాప్‌కిన్ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పారని విష్ణుకుమార్ రాజు అన్నారు. స్నానం చేసేటప్పుడు 3 వే మిక్సింగ్ షవర్ ఖరీదు 4 లక్షల 3 వేల రూపాయలని, మెయిన్ డోర్ ఖరీదు రూ. 24 లక్షలు, డోర్‌కు ఉండే గ్రిల్ రూ. 12 లక్షలు, మార్బుల్ ఫ్లోరింగ్ చదరపు మీటరు రూ.37 వేల 706. కళింగ బ్లాక్‌లో మెయిన్ డోర్, గ్రిల్ కలిపి రూ.57 లక్షలు, వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ చదరపు మీటరుకు తెల్ల మార్బుల్ రూ.79 వేలు ఖర్చు చేశారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

ఈ క్రమంలో రేపు (శుక్రవారం) జీరో అవర్‌ను రద్దు చేసి దీనిపై చర్చ పెడదామని స్పీకర్ అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ... ఈ రోజు తాను కూడా మాట్లాడుతానని... తనకు రేపు అవకాశం ఉండదని ఆయన అన్నారు. రేపు మళ్ళీ జీరో అవర్ ఉండదు కదా అన్న రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలకు స్పీకర్ అంగీకరించారు. మళ్లీ విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఏమి చేయనిదానికి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని, తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా బాధపడ్డారని అన్నారు. మరి ఇంత దుర్వినియోగం చేసిన జగన్ జీవిత కాలం జైలులో ఉంచాలి కదా అని విష్ణు కుమార్ రాజు అన్నారు. అధికార దుర్వినియోగంపై ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దీనిపై వెంటనే చర్చ చేపట్టి జగన్‌ను జైల్లో పెట్టాలని విష్ణు కుమార్ రాజు అన్నారు.


రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ..

రుషికొండపై తాను హైకోర్టుకు వెళ్లానని.. తనపై సుప్రీం కోర్టుకు కూడా అబద్ధం చెప్పారని రఘురామ కృష్ణం రాజు అన్నారు. సిఎం నివాసం కోసం అని చెబితే అది అబద్ధం అని కోర్టుకు చెప్పారన్నారు. అప్పటి వరకు టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఆ తరువాత సిఎంకు నివాసం అని చెప్పారన్నారు. అధికారుల కమిటీ వెళ్తుంటే వాళ్లకు రుషికొండ నివాసం కనిపించిందట..వెంటనే వాళ్ళు రుషికొండ సిఎం నివాసానికి పనికొస్తుందని చెప్పారన్నారు. రూ. 400 కోట్లు పెట్టీ జగన్ రాజకీయ సమాధి కట్టుకున్నారని, మనం నెగెటివ్‌లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలన్నారు. ఈ ప్యాలెస్ కట్టడం వలనే జగన్ పతనం ప్రారంభమైందన్నారు. ఈ కట్టడాన్ని మంచి భవనంగా తీర్చి దిద్దాలన్నారు. అందరి మనోభావాలను తెలుసుకున్న తరువాత దీనిపై సోమవారం ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకుందామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీంతో రుషికొండపై చర్చ ముగిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నాకు అంత స్ధాయిలేదు లోకేష్‌ అన్నా..: శ్రీరెడ్డి

వైసీపీ సర్పంచ్ హుసేని ఇద్దరు కార్యకర్తల అరెస్టు..

అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...

ప్రజా పాలన విజయోత్సవాలు..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 14 , 2024 | 12:32 PM