Home » Sand Mafia
మండలంలోని వేదవతిహగరి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని కళ్లుదేవనహళ్లి, సింగానహళ్లి, బొల్లనగుడ్డం తదితర గ్రామాల శివార్లలో ఉన్న నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కాలం కంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి పనిచేసే కలెక్టర్లే కాదు... ‘కాలజ్ఞానం’ తెలిసిన కలెక్టర్లు కూడా ఉన్నారండోయ్..! పై నుంచి ఏ ఆదేశాలు వస్తాయో మూడు రోజులు ముందే ఊహించి అందుకనుగుణంగా పనిచేసేస్తారు..!
ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా ఇలాగే... అడ్డంగా, నిలువుగా దొరికిపోయింది. ‘ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండీ’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదుకాదు... కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తాను నడుపుతున్న ట్రాక్టర్ నుంచి అకస్మాత్తుగా దూకి పరారయ్యాడు.
ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలండర్‌ను రూపొందించాలని, ఆ తర్వాతే గనుల టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గడిచిన రెండేళ్లలో గనుల శాఖ రాబడులను ఆయన సమీక్షించారు. గనుల శాఖ ద్వారా ఆదాయాలను పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు.
కంబదూరు మండలంలోని నూతిమడుగు పెన్నానది పరివాహక ప్రాంతంలో గురువారం రాత్రి ఇసుకను తరలించేందుకు వచ్చిన టిప్పర్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎక్స్కవేటర్ సాయంతో తవ్వకాలు జరిపి ప్రతి రోజూ రాత్రి సమయాల్లో ఇసుకను టిప్పర్ల సాయంతో అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరుకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
త ప్రభుత్వం చేపట్టిన అక్రమ ఇసుక తవ్వకాల తాలూకు విపరిణామాలు ప్రస్తుత ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ఆదాయమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన ఇసుక తవ్వకాలపై ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ, మైనింగ్ శాఖలకు చెనైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ కోర్టు రూ.25 కోట్ల చొప్పున తాత్కాలిక జరిమానా విధించడం తెలిసిందే.
మండలంలోని వేదవతి హగరిలో ఇసుక తరలింపునకు కేటీఎస్ చానల్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేపరాల గ్రామస్థులు వన్నూరప్ప, వీరేష్, వెంకటేశులు, నాగరాజు, చిన్నరాజప్ప లు కోరారు. ఈమేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చిట్టిబాబుకు వినతిపత్రం అందించారు.
పెన్నానది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లను యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు తెలిపినా స్పందించలేదన్నారు.
Andhrapradesh: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు.