Home » Sangareddy
సంగారెడ్డి జిల్లా అందోల్ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
నీటి పారుదల శాఖలో లంచావతారుల బాగోతం బట్టబయలైంది. ఒకే సారి ముగ్గురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. నాలా సమీపంలో భవన నిర్మాణానికి సంబంధించి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ.2.50లక్షలు డిమాండ్ చేసిన అధికారులు.. తొలుత రూ.1.50లక్ష తీసుకున్నారు.
ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్‌సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రియల్ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.
భిన్న సామాజిక వర్గాలకు చెందిన మైనర్ల మధ్య ప్రేమ.. ఫలితంగా ఆ వర్గాల పెద్దల మధ్య మనస్పర్థలు.. చివరికి బాలుడి తండ్రి మృతికి దారితీశాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మం డలం బడంపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బ్యాగరి నరసింహులు.
రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అధునాతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కెఫెటేరియాలు, వెయిటింగ్ లాంజ్‌లు ఇతర హంగులతో కార్పొరేట్ ఆఫీసుల తరహాలో ఈ బిల్డింగ్లు కట్టాలని భావిస్తోంది.
అందోల్‌లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.
పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని ఓ స్ర్కాప్ దుకాణంలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు గంట పాటు భారీ ఎత్తున నల్లటి పొగతో కూడిన మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న పరిశ్రమ కార్మికులు,
సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని రంగనాయకసాగర్ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని నాగిరెడ్డి తెలిపారు.