Home » Sensex
గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు (ఆగస్టు 21న) భారతీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9.28 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 135.61 పాయింట్లు లేదా 0.17 శాతం దిగువన 80,667.25 స్థాయిల వద్ద ప్రారంభమైంది.
స్టాక్ మార్కెట్(stock markets)లో ఇన్వెస్ట్ చేయడంలో చాలా రిస్క్ ఉంటుందని అనేక మంది చెబుతుంటారు. కానీ దీనిలో సరైన ప్రణాళికతో పెట్టుబడులు చేస్తే కోటీశ్వరులు కావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఓ మల్టీ బ్యాగర్ స్టాక్‌లో రెండు లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 3 కోట్లకుపైగా వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాఖీ పండుగ రోజైన నేడు దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గ్రీన్‌లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 9.16 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 80,665 స్థాయిల వద్ద 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అదే సమయంలో నిఫ్టీ50 సూచీ 70 పాయింట్లకుపైగా పెరిగి 24,628 స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock markets) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. IPO క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 19 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఏడు కొత్త IPOలు మార్కెట్లో రానున్నాయి. వాటిలో రెండు IPOలు మెయిన్‌బోర్డ్ విభాగంలో వస్తుండగా, మరో 5 IPOలు SME విభాగంలో రాబోతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(శుక్రవారం) భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ మంచి ఓపెనింగ్ కనబరిచి 593.67 పాయింట్లు పెరిగి 79,699.55 వద్ద ట్రేడైంది.
గడిచిన రెండ్రోజులుగా బేర్ రంకెతో స్టాక్ మార్కెట్ షేర్లు తగ్గుతూ వస్తుండగా.. బుధవారం కాస్త ఉపశమం లభించింది. ఐటీ స్టాక్‌లలో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్‌పై సానుకూలంగా ప్రభావం చూపించాయి.
హిండెన్‌బర్గ్(Hindenburg) ఆరోపణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ హిండెన్‌బర్గ్.. సెబీ చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేయడంతో ఇవాళ్టి మార్కెట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్టు 12న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్‌బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 9న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 819.69 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 79,705.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 250.50 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 24,367.50 వద్ద ముగిసింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 327, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ 493 పాయింట్లు లాభపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం (ఆగస్టు 8న) రోజంతా హెచ్చుతగ్గులకు లోనై చివరకు నష్టాలతో(losses) ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 582 పాయింట్లు పతనమై 78,886 వద్ద ముగిసింది. నిఫ్టీ(nifty) 181 పాయింట్లు పతనమై 24,117 వద్దకు చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్ 38 పాయింట్లు పెరిగి 50,157 వద్ద స్థిరపడింది.