Stock Markets: రాఖీ రోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఇవే లాభాల స్టాక్స్
ABN , Publish Date - Aug 19 , 2024 | 09:31 AM
రాఖీ పండుగ రోజైన నేడు దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గ్రీన్‌లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 9.16 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 80,665 స్థాయిల వద్ద 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అదే సమయంలో నిఫ్టీ50 సూచీ 70 పాయింట్లకుపైగా పెరిగి 24,628 స్థాయికి చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నేడు(ఆగస్టు 19న) లాభాలతో ప్రారంభమయ్యాయి. రాఖీ పండుగ రోజైన నేడు దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గ్రీన్‌లో మొదలయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ సానుకూల ప్రారంభాన్ని సూచించిన క్రమంలో మార్కెట్లు పాజిటివ్ ధోరణుల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 9.16 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 80,665 స్థాయిల వద్ద 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అదే సమయంలో నిఫ్టీ50 సూచీ 70 పాయింట్లకుపైగా పెరిగి 24,628 స్థాయికి చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
టాప్ 5 స్టాక్స్
హిండెన్‌బర్గ్ సెబీ వివాదం మధ్య స్టాక్ మార్కెట్ పతనమై ఇప్పుడు మళ్లీ కోలుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం BPCL, ONGC, శ్రీరామ్ ఫైనాన్స్, NTPC, టైటాన్ కంపెనీల షేర్లు టాప్ 5 లాభాల్లో ఉండగా, M&M, HDFC లైఫ్, టాటా మోటార్స్, గ్రాసిమ్, నెస్లే సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. రంగాలవారీగా నిఫ్టీ PSU బ్యాంక్, OMCలు, మీడియాలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 1 శాతం పెరగగా, మిడ్‌క్యాప్ 0.41 శాతం పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియా పసిఫిక్ మార్కెట్లు సోమవారం ఉదయం గ్రీన్‌లో విస్తృతంగా ట్రేడవుతున్నాయి. చైనా షాంఘై కాంపోజిట్ 0.07 శాతం, హాంకాంగ్ హాంగ్ సెంగ్ 1.88 శాతం, ఆసియా డౌ 0.21 శాతం లాభపడ్డాయి. మరోవైపు జపాన్‌కు చెందిన నిక్కీ 0.35 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.44 శాతం, ఆస్ట్రేలియా ఎస్‌అండ్‌పీ/ఏఎస్‌ఎక్స్ 200 0.07 శాతం చొప్పున క్షీణించాయి. US మార్కెట్లలో S&P 500 శుక్రవారం 0.20 శాతం పెరిగింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.24 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.21 శాతం పెరిగింది.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలివే.. ఈసారి ఎన్నంటే..
ఈ నిర్ణయాలే కీలకం
ఈవారం ఆసియా మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ప్రధాన నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ కొరియా వడ్డీ రేట్లపై నిర్ణయం, జపాన్, సింగపూర్ నుంచి ద్రవ్యోల్బణం డేటా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆగస్టు సమావేశం ఫలితాలు, చైనా సంవత్సరం, ఐదు సంవత్సరాల రుణ కీలక రేట్లపై నిర్ణయం వంటి అంశాలు ఉన్నాయి.
శుక్రవారం మార్కెట్ ఎలా ఉంది?
బీఎస్‌ఈ సెన్సెక్స్ శుక్రవారం 1,330.96 పాయింట్లు లేదా 1.68 శాతం పెరిగి మరోసారి 80 వేల మార్కును దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 80,436.84 వద్ద ముగిసింది. అదే సమయంలో NSE నిఫ్టీ 397.40 పాయింట్లు లేదా 1.65 శాతం స్వల్ప లాభంతో 24,541.15 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి:
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News