Share News

Stock Market Updates: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిమిషాల్లోనే రూ.3.67 లక్షల కోట్ల లాభం

ABN , Publish Date - Aug 16 , 2024 | 10:20 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(శుక్రవారం) భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ మంచి ఓపెనింగ్ కనబరిచి 593.67 పాయింట్లు పెరిగి 79,699.55 వద్ద ట్రేడైంది.

Stock Market Updates: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిమిషాల్లోనే రూ.3.67 లక్షల కోట్ల లాభం
Stock market today updates

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(శుక్రవారం) భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ మంచి ఓపెనింగ్ కనబరిచి 593.67 పాయింట్లు పెరిగి 79,699.55 వద్ద ట్రేడైంది. నిఫ్టీ 50 172.30 పాయింట్లు లేదా 0.71 శాతం పెరుగుదలతో 24,316.05 వద్ద ట్రేడైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఒక రోజు క్రితం సెన్సెక్స్ 79,105.88 వద్ద, నిఫ్టీ 24,143.75 వద్ద ముగిశాయి.


ఇన్వెస్టర్ల సంపద

గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలమైన సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఊహించిన దాని కంటే మెరుగైన రిటైల్ విక్రయాలు సహా పలు అంశాల నేపథ్యంలో బలమైన పెరుగుదలకు దారితీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు గొప్ప మద్దతును లభించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో రంగాల సూచీలు అన్ని గ్రీన్‌లో ఉన్నాయి. ఆటో, ఐటీ, మెటల్, మీడియా, ఆయిల్ & గ్యాస్‌ల నిఫ్టీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కూడా మంచి కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కొక్కటి అర శాతానికి పైగా పెరిగాయి. ఓవరాల్‌గా బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.3.67 లక్షల కోట్లు పెరిగింది. అంటే మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్ల సంపద రూ.3.67 లక్షల కోట్లు పెరిగిందని చెప్పవచ్చు.


పలు షేర్లలో

సెన్సెక్స్‌లో 30 షేర్లు జాబితా చేయబడగా, వాటిలో 28 గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. M&M, టాటా స్టీల్‌లలో అతిపెద్ద పెరుగుదల కనిపించింది. మరోవైపు పవర్ గ్రిడ్, HUL క్షీణతలో ఉన్నాయి. BSEలో 2685 షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో 1997 షేర్లు స్ట్రాంగ్ గా కనిపించగా, 538 క్షీణతతో, 150 ఎలాంటి మార్పును కనబరచలేదు. ఇది కాకుండా 74 షేర్లు ఏడాది గరిష్టానికి, 17 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. 90 షేర్లు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకోగా, 74 షేర్లు లోయర్ సర్క్యూట్‌కు చేరుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 10:27 AM