Share News

Stock Market Today: ఐటీ కొనుగోళ్ల జోరు.. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Aug 14 , 2024 | 04:43 PM

గడిచిన రెండ్రోజులుగా బేర్ రంకెతో స్టాక్ మార్కెట్ షేర్లు తగ్గుతూ వస్తుండగా.. బుధవారం కాస్త ఉపశమం లభించింది. ఐటీ స్టాక్‌లలో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్‌పై సానుకూలంగా ప్రభావం చూపించాయి.

Stock Market Today: ఐటీ కొనుగోళ్ల జోరు.. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: గడిచిన రెండ్రోజులుగా బేర్ రంకెతో స్టాక్ మార్కెట్ షేర్లు తగ్గుతూ వస్తుండగా.. బుధవారం కాస్త ఉపశమం లభించింది. ఐటీ స్టాక్‌లలో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్‌పై సానుకూలంగా ప్రభావం చూపించాయి. రెండ్రోజుల నష్టాల పరంపరను అధిగమించి ఇవాళ సానుకూలంగా ముగిశాయి. దేశీయ సూచీల్లో సెన్సెక్స్ కొంత లాభాలతో గట్టెక్కగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. బుధవారం ఉదయం కొంత గ్యాప్ అప్ నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభమవ్వగా రోజంతా కన్సాలిడేషన్ జరిగింది. అయితే ఇతర రంగాలల్లో ఇంట్రాడే లాభాలను తగ్గించాయి. చివరికి ఐదు పాయింట్ల లాభంతో 24,143 వద్ద నిలిచింది.

అటు సెన్సెక్స్ 150 పాయింట్లు బలపడి 79,105 వద్ద ముగిసింది. మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 149.85 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 79,105.88 వద్ద, నిఫ్టీ 4.75 పాయింట్లు లేదా 0.02 శాతం పెరిగి 24,143.75 వద్ద స్థిరపడ్డాయి. కాగా.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మార్కెట్లు మూతపడనున్నాయి. సానుకూల ప్రారంభంతో మార్కెట్ మొదటి అర్ధభాగంలో అన్ని లాభాలను చెరిపివేసి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. సెకండాఫ్‌లో జరిగిన కొనుగోళ్లు నిఫ్టీకి 24,200 దగ్గరకు చేరుకోవడానికి సహాయపడింది. అయితే ఇది కూడా ఫ్లాట్‌గా ముగిసింది.


టాప్ గెయినర్స్ ఇవే..

నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ ఉన్నాయి. దివీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మాత్రం నష్టపోయాయి. ఐటీ (1.5 శాతం వృద్ధి) మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, మెటల్, రియాల్టీ, ఫార్మా, మీడియా 0.5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున తగ్గాయి.

పీబీ ఫిన్‌టెక్, టొరెంట్ ఫార్మా, టీవీఎస్ మోటార్, అజంతా ఫార్మా, ఆయిల్ ఇండియా, మార్క్సన్స్ ఫార్మా, గ్రావిటా ఇండియా, సర్దా ఎనర్జీ, ఎడెల్‌వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐనాక్స్ విండ్ ఎనర్జీ తదితరాలతో సహా బీఎస్‌ఈలో 170కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం ఉండటంతో ఇవాళ భారతీయ ఈక్విటీ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ స్వల్ప ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రారంభమయ్యాయి. రోజంతా ఇలాగే కొనసాగింది. చివరకు 49,727 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా.. అరిసిన్‌ఫ్రా సొల్యూషన్స్ రూ. 600 కోట్ల IPO కోసం SEBIకి ఇవాళ DRHP ఫైల్ చేసింది.

Updated Date - Aug 14 , 2024 | 04:43 PM