Home » Shamshabad
అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
హైదరాబాద్: ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత అమెరికా వెళ్లిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఇంటి నెంబరు కేటాయించేందుకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆమెకు సహకరించిన బిల్ కలెక్టర్ బాల్‌రాజ్ ఏసీబీకి పట్టుబడ్డారు.
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేపైనే నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాప్ కాకుండా విమానం రన్వపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజులుగా అధికారులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది. విమానాశ్రయంలోని ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్‌లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆందోళన కలిగిస్తోంది. చిరుత రింగ్ రోడ్డులోపలికి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌లోని నోవోటెల్ హోటల్లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు, పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు.
కన్హా శాంతివనం సందర్శనకు నేడు భారత ఉప రాష్ట్రపతి రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్(Joel Davis) తెలిపారు.
అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన 13.61కిలోల బంగారం ఫిబ్రవరి నెలలో పట్టుబడిందని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Telangana: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత షరా మామూలైపోయింది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతూనే ఉంది.