Home » Sharad Pawar
కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు..! మరికొందరేమో తెరవెనుక కీలక వ్యూహకర్తలు..!
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘ఎన్సీపీ-ఎస్సీపీ’ పేరుతో పాటు ‘మనిషి ఊదుతున్న తుర్రా’ (Man Blowing Turrah) చిహ్నాన్ని ఉపయోగించుకోవచ్చని.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (National Congress Party) చెందిన శరద్ పవార్ (Sharad Pawar) వర్గానికి సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఆ చిహ్నాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్నికల చిహ్నంగా రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని (Election Commission Of India) ఆదేశించింది.
మహారాష్ట్ర దిగ్గజ నేత, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ విందు ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారంనాడు తోసిపుచ్చారు. ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నానంటూ సీఎం తెలియజేశారు.
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య లోక్ సభ సీట్ల లెక్క కుదిరింది. శివసేన (యూబీటీ) 21 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ 9 చోట్ల బరిలోకి దిగనుంది.
మరాఠీలకు రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మనోజ్ జారంగే ఉద్యమిస్తున్నారు. తనను హత్య చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మనోజ్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. శరద్ పవార్ మనోజ్ చేత ఆరోపణలు చేయించారని మండిపడింది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తారని మరాఠీ రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. మనోజ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఖండించారు. తమ ప్రభుత్వ సహనాన్ని పరీక్షించొద్దని తేల్చిచెప్పారు.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల గుర్తుగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' ని కేటాయించింది. ఈ గుర్తుతోనే లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం పోటీ చేయనుంది.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ ఎక్కువ స్థానాలు అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. 39 సీట్లను ఉద్దవ్ థాకరే, శరద్ పవార్, ప్రకాష్ అంబేద్కర్ పార్టీ అడిగినట్టు తెలుస్తోంది. 8 సీట్లలో ఇండియా కూటమిలో విభేదాలు వచ్చాయి.
రానున్న లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే తేల్చిచెప్పారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదని..