Pune : అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగానే పోటీ: శరద్ పవార్
ABN , Publish Date - Jul 01 , 2024 | 03:53 AM
మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందని సీనియర్ నాయకుడు, ఎన్ఎ్సపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ వెల్లడించారు.
పుణె, జూన్ 30: మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందని సీనియర్ నాయకుడు, ఎన్ఎ్సపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఈ కూటమిలోని ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఠాక్రే), కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగానే రంగంలో ఉంటాయని తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ కూటమిలో చిన్న పార్టీలను కూడా చేర్చుకుంటామని చెప్పారు. గత లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలు, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీకి సీట్లు ఇవ్వలేకపోయామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వాటికి సీట్లను సర్దుబాటు చేయాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందని చెప్పారు.