Home » Sharad Pawar
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల గుర్తుగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' ని కేటాయించింది. ఈ గుర్తుతోనే లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం పోటీ చేయనుంది.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ ఎక్కువ స్థానాలు అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. 39 సీట్లను ఉద్దవ్ థాకరే, శరద్ పవార్, ప్రకాష్ అంబేద్కర్ పార్టీ అడిగినట్టు తెలుస్తోంది. 8 సీట్లలో ఇండియా కూటమిలో విభేదాలు వచ్చాయి.
రానున్న లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే తేల్చిచెప్పారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదని..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయించడంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
భారత ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీ పేరు, గుర్తును కోల్పోయిన శరద్ పవార్ ''నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ'' ఇక నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్ గా పోటీలోకి దిగుతుంది. కొత్త పేరుకు ఈసీఐ ఆమోదం తెలిపింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తుపై తలెత్తిన వివాదంపై భారత ఎన్నికల సంఘం అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ వర్గానికి అనుకూలంగా మంగళవారంనాడు తీర్పునిచ్చింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీనే నిజమైన ఎన్సీపీ అని ప్రకటించింది. ఆ పార్టీ పేరు, గుర్తు ఆయన వర్గానికే కేటాయించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీని తాజా గడువుగా నిర్ణయించింది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వేసిన పిటిషన్పై తొలుత జనవరి 31వ తేదీని గడువుగా అత్యున్నత న్యాయస్థానం విధించింది.
ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ‘ప్రధాని అభ్యర్థి ఎవరు’ అనే ప్రశ్న హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పటికే కూటమిలోని ప్రధాన అభ్యర్థులు.. ఎన్నికలయ్యాకే ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చాలాసార్లు..
ముంబై: ఇండియా కూటమి (I.N.D.I.A. bloc) కన్వీనర్ నియామకంపై కూటమి నేతల మధ్య ఎలాంటి వివాదం లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారంనాడు తెలిపారు. కూటమి ప్రధాని పేరు ప్రకటించి లోక్సభ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లీడర్ను ఎన్నుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.