Share News

Sharad Pawar: ఆ చిహ్నం వాడుకోవచ్చంటూ శరద్ పవార్‌కి సుప్రీం అనుమతి.. అజిత్ పవార్‌కి షాక్

ABN , Publish Date - Mar 19 , 2024 | 05:10 PM

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘ఎన్‌సీపీ-ఎస్‌సీపీ’ పేరుతో పాటు ‘మనిషి ఊదుతున్న తుర్రా’ (Man Blowing Turrah) చిహ్నాన్ని ఉపయోగించుకోవచ్చని.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (National Congress Party) చెందిన శరద్ పవార్ (Sharad Pawar) వర్గానికి సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఆ చిహ్నాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్నికల చిహ్నంగా రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని (Election Commission Of India) ఆదేశించింది.

Sharad Pawar: ఆ చిహ్నం వాడుకోవచ్చంటూ శరద్ పవార్‌కి సుప్రీం అనుమతి.. అజిత్ పవార్‌కి షాక్

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘ఎన్‌సీపీ-ఎస్‌సీపీ’ పేరుతో పాటు ‘మనిషి ఊదుతున్న తుర్రా’ (Man Blowing Turrah) చిహ్నాన్ని ఉపయోగించుకోవచ్చని.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (National Congress Party) చెందిన శరద్ పవార్ (Sharad Pawar) వర్గానికి సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఆ చిహ్నాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్నికల చిహ్నంగా రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని (Election Commission Of India) ఆదేశించింది. ఆ గుర్తును ఏ ఇతర పార్టీకి లేదా అభ్యర్థికి కేటాయించరాదని స్పష్టం చేసింది.


ఇదే సమయంలో.. ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పేరుని గానీ, ఫోటోలను గానీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకుండా అజిత్ పవార్ (Ajit Pawar) వర్గాన్ని అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది. అలాగే, గడియారం గుర్తుకు సంబంధించిన వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ గడియారం గుర్తు ‘కోర్టులో పరిశీలనలో ఉందని’ పబ్లిక్ నోటీసు జారీ చేయాలని అజిత్ పవార్ వర్గాన్ని కోర్టు చెప్పింది. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో ఈ నోటీసులు ఇవ్వాలని.. అన్ని ప్రచార ప్రకటనల్లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించాలని సూచించింది. అంతకుముందు.. అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్‌సీపీగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఇదిలావుండగా.. రాజకీయ ప్రయోజనాల కోసం పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ శరద్‌ పవార్‌ వర్గం గతవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్‌ పవార్‌ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్‌ వర్గాన్ని కోర్టు ప్రశ్నించింది. సొంత పార్టీ గుర్తింపుతో ముందుకు వెళ్ళాలని సూచించింది. శరద్ పవార్ పేరు, చిత్రాలను ఉపయోగించబోమని హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా శరద్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కొత్త చిహ్నాన్ని జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 05:10 PM