Home » Shiv Sena
లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
శివసేన వర్గాల మధ్య 2022లో తలెత్తిన వివాదంలో ఏక్నాథ్ షిండే వర్గం శివసేనే నిజమైన శివసేన అంటూ మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ తన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు.
శివసేన ఉద్ధవ్ థాకరే, శివసేన షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలకమైన తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేశారు.''మాకు మెజారిటీ ఉంది'' అని ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మహా వికాస్ అఘాడి మధ్య అవగాహన కుదిరింది. మహావికాస్ అఘాడిలో శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను మూడు భాగస్వామ్య పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు ఆయా పక్షాల నేతలు తెలిపారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి 23 సీట్లలో తాము పోటీ చేస్తామని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం శుక్రవారం మరోసారి తేల్చిచెప్పింది. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఎక్కువ సీట్లలోనే పోటీ చేస్తూ వస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
దేశ ముఖద్వారం వరకూ నియంతృత్వం వచ్చి చేరిందని, దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈస్ట్ ముంబైలోని కుర్లాలో సోమవారంనాడు జరిగిన జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం 'ఇండియా' కూటమికి మఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారం ఇంకా మంతనాల స్థాయిలోనే ఉండగానే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన 23 లోక్‌సభ స్థానాలలో తాము పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి శివసేనకు చెందిన రెండు వర్గాల పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విషయంలో మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు మరికొంత గడువు ఇచ్చింది. 2024 జనవరి 10వ తేదీ వరకూ గడువును పొడిగించింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ శివసేన వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఎడతెగని జాప్యం చేస్తుండటంతో ఇప్పటికే రెండుసార్లు తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది.