Share News

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:18 PM

మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

ముంబై, జూన్ 16: మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అలాంటి వేళ ఇండియా కూటమిలో భాగస్యామ్య పక్షం శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం ముంబైలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ లోక్‌సభ స్పీకర్‌ అభ్యర్థిని బరిలో నిలిపితే తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయని తెలిపారు.

Also Read: Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి


2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేసిందని, అయితే ప్రస్తుతం బీజేపీకి ఆ పరిస్థితి లేదని సంజయ్ రౌత్ ప్రస్తావించారు. మోదీ ముచ్చటగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో భాగస్యామ్య పక్షాల పాత్ర అత్యంత కీలకంగా మారిందని, అందుకే ఎన్డీయే పక్ష పార్టీలకు లోక్‌సభ స్పీకర్ పదవి అతి ముఖ్యమైనదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. స్పీకర్ పదవిని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనతాదళ్ (యూ), లోక్ జనశక్తి (పాశ్వాన్) పార్టీలకు ఇవ్వకుంటే ఆ పార్టీలను చీల్చే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: Amit Shah:జమ్ము కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై సమీక్ష


లోక్‌సభ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరినట్టు తమకు తెలిసిందని, చంద్రబాబు డిమాండ్‌కు బీజేపీ పెద్దలు మద్దతు ఇవ్వకుంటే తాము ఇచ్చేందుకు సిద్దమని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

Also Read: Suresh Gopi :‘మదర్ ఇండియా’ వ్యాఖ్యలపై వివరణ


మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేబినెట్‌లో కొన్ని కీలక శాఖలతోపాటు లోక్‌సభ స్పీకర్ పదవిని తమకు కేటాయించాలని బీజేపీ పెద్దలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతలు కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ క్రమంలో వివిధ కీలక మంత్రి పదవులతో పాటు లోక్‌సభ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకుంటామని వారికి బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరించినట్లు తెలుస్తుంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 06:38 PM