Home » Shubman Gill
వరల్డ్‌కప్‌లో 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మన టీమిండియాకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో మన భారతీయ కీలక ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. వాళ్లే.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.
Team India: ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో మొదటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వరుస విజయాలు నమోదు చేసిన భారత జట్టు.. తాజాగా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది. ఆదివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ ఘనత సాధించింది.
IND vs NED: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. మొదటి నుంచి ఐదో బ్యాటర్ దాకా.. ప్రతి ఒక్కరూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా.. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అయితే పరుగుల సునామీ సృష్టించారు.
Sara Tendulkar: టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో సారా టెండూల్కర్ దర్శనమిస్తోంది. స్టేడియానికి వచ్చి టీమిండియా ఆటగాళ్లకు ముఖ్యంగా గిల్‌కు తన మద్దతు తెలుపుతోంది. అయితే తాజాగా సారా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ICC ODI Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఏకంగా ముగ్గురు బ్యాటర్లు టాప్ 3లో ఉండడం గమనార్హం.
భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తాజాగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకొని చరిత్రపుటలకెక్కాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా..
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.
పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి హాజరైంది. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది. బ్యాటింగ్‌లోనూ శుభ్‌మన్ గిల్ రెండు సిక్సర్లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతడిని అభినందించింది.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 67 పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించనున్నాడు. గిల్ తన తర్వాతి 3 ఇన్నింగ్స్‌లో 67 పరుగులు సాధిస్తే వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచరికార్డు నెలకొల్పుతాడు.