World cup: మరో 67 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు బ్రేక్ చేయనున్న గిల్.. సౌతాఫ్రికా దిగ్గజం రికార్డు గల్లంతు!
ABN , First Publish Date - 2023-10-19T12:54:39+05:30 IST
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 67 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్నాడు. గిల్ తన తర్వాతి 3 ఇన్నింగ్స్‌లో 67 పరుగులు సాధిస్తే వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచరికార్డు నెలకొల్పుతాడు.
పుణె: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 67 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్నాడు. గిల్ తన తర్వాతి 3 ఇన్నింగ్స్‌లో 67 పరుగులు సాధిస్తే వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచరికార్డు నెలకొల్పుతాడు. ఈ క్రమంలో దక్షణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును గిల్ బద్దలుకొడతాడు. ఆమ్లా తన 40 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం గిల్ 36 ఇన్నింగ్స్‌ల్లో 64 సగటుతో 1,933 పరుగులు చేశాడు. కాబట్టి తర్వాతి 3 ఇన్నింగ్స్‌ల్లో 67 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డును బ్రేక్ చేస్తాడు. దీంతో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనే గిల్ ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అలాగే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 26 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి. ఇప్పటివరకు 510 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 566 ఇన్నింగ్స్‌ల్లో ఈ పరుగులు సాధించాడు. అయితే కోహ్లీ మరో 34 ఇన్నింగ్స్‌ల్లో మిగతా 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 26,000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడు. సచిన్ 600 ఇన్నింగ్స్‌ల్లో 26 వేల పరుగులు పూర్తి చేశాడు.