Home » Siddipet
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేసుడు కాదు, ఆరు గ్యారెంటీలను టచ్ చేసి ప్రజలకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది..
సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, వెంకట్రామ్ రెడ్డి బుధవారం ఉదయం నంగునూర్ మండలం, కొనాయి పల్లి వెంకటేశ్వరా స్వామి దేవాలయంలో స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరసగా పర్యటించనున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. రేపు మధ్యహాన్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఎక్కువ వడ్డీ విధించే ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝులిపించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల శనివారం నాడు దాడులు నిర్వహించారు. ఉమ్మడి జగిత్యాల జిల్లా మెట్ పల్లి, సిద్దిపేటలో పోలీసులు దాడులు చేశాయి. సిద్దిపేట జిల్లాలో 24 బృందాలు దాడులు నిర్వహించాయి. 38 ఫైనాన్స్ సంస్థలపై కేసు నమోదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమని ఆరోపించారు. మంగళవారం రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు హరీశ్‌రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలాకాలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. కొండపాక మండలం, ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
Telangana: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తో పాటు, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు.
Telangana: ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తుముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మ - నరేందర్ , వంద మందికి పైగా ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేశారు.