Share News

BRS: మెదక్ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఉంటా: వెంకట్రామ్ రెడ్డి

ABN , Publish Date - Apr 24 , 2024 | 10:09 AM

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, వెంకట్రామ్ రెడ్డి బుధవారం ఉదయం నంగునూర్ మండలం, కొనాయి పల్లి వెంకటేశ్వరా స్వామి దేవాలయంలో స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

BRS: మెదక్ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఉంటా: వెంకట్రామ్ రెడ్డి
BRS, Venkatramreddy.

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ (BRS) మెదక్ పార్లమెంట్ (Medak Parliament) ఎంపీ అభ్యర్థి (MP Candidate) మాజీ కలెక్టర్, వెంకట్రామ్ రెడ్డి (Venkatram Reddy) బుధవారం ఉదయం నంగునూర్ మండలం, కొనాయి పల్లి వెంకటేశ్వరా స్వామి దేవాలయం (Venkateswaraswamy Temple)లో స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు (Nomination documents) పెట్టీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాలను కొనాయిపల్లి ఆలయంలో పెట్టీ ప్రత్యేక పూజలు చేశామని, ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఉంటానని, ప్రజల సేవకు అంకితం అవుతానని చెప్పారు.


ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తానని, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్న దేవుడిపై సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్న.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 100 కోట్లతో ఫంక్షన్ హాల్, పేదలకు విద్య అందిస్తామన్నారు. మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా ఘనవిజయం సాధిస్తానని వెంకట్రామ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలెక్టర్‌గా పనిచేసే అవకాశం తనకు రావడం అదృష్టమని వెంకట్రామ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తాను మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. కలెక్టర్‌గా మెదక్ ఉమ్మడి ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని, ఇకపై రాజకీయాల్లోనూ పేదలకు సేవ చేస్తానని వెంకట్రామ్ రెడ్డి ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు జిల్లా: ఉపాధి హామీ కూలీలతో మమేకమైన సీతక్క

డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు

జగన్‌కు మరో షాక్‌!

కడప జిల్లా కోర్టు గీత దాటింది!

Read Latest AP News and Telugu News

National News, Telangana News, Sports News

Updated Date - Apr 24 , 2024 | 10:12 AM