Home » Smriti Irani
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో తాను ఓటమి పాలైనా.. అసలు విజయం మాత్రం తనదేనని ఆమె స్పష్టం చేశారు. అమేఠీ లోక్‌సభ సభ్యురాలిగా గతంలో ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఈ సందర్బంగా స్మృతి ఇరానీ సోదాహరణగా వివరించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హుందాతనాన్ని ప్రదర్శించారు. తన పట్ల తీవ్ర విమర్శలు గుప్పించే బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పట్ల అవమానకరమైన పదాలు ఉపయోగించవద్దంటూ కాంగ్రెస్ శ్రేణులను కోరారు.
భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ఆయన కేబినెట్‌లో ఉండే ఎంపీలపై క్లారిటీ వచ్చింది. మొత్తం 57 మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు.
మరికొద్ది సేపట్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ సర్కారు కొలువుతీరబోతోంది. దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 50 మంది వరకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మోదీ కేబినెట్‌లో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, ఆశావహులకు చోటుదక్కలేదని తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.
‘అమేఠీలో గెలవలేక ఓటమి భయంతో ఇక్కడి నుంచి పారిపోయాడు’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీని..
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపు ఖాయమంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ గెలుపు దాదాపు ఖాయం కావడంతో ఆయన తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా 'అడ్వాన్స్ గ్రీటింగ్స్' చెప్పారు. ''కిషోరి భాయ్... మీ గెలుపు ఖాయమని నాకు ముందే తెలుసు'' అంటూ ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కీలకమైన అమేథీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ తొలి ట్రెండ్స్ ప్రకారం స్మృతి ఇరానీ 34,887 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
అమేఠీ లోక్‌సభ స్థానం మరోసారి బీజేపీ ఖాతాలో పడనుందని యాక్సెస్ మై ఇండియా తన ఎగ్జిట్ పోల్‌లో స్పష్టం చేసింది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వరుసగా రెండో సారి గెలవనున్నారని తెలిపింది.
కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ లోక్‌సభ స్థానం అభ్యర్థి స్మృతి ఇరానీని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆమె అమేథీ..