Share News

Amethi: మళ్లీ గెలవనున్న స్మృతీ ఇరానీ

ABN , Publish Date - Jun 02 , 2024 | 07:54 PM

అమేఠీ లోక్‌సభ స్థానం మరోసారి బీజేపీ ఖాతాలో పడనుందని యాక్సెస్ మై ఇండియా తన ఎగ్జిట్ పోల్‌లో స్పష్టం చేసింది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వరుసగా రెండో సారి గెలవనున్నారని తెలిపింది.

Amethi: మళ్లీ గెలవనున్న స్మృతీ ఇరానీ

న్యూఢిల్లీ, జూన్ 02: అమేఠీ లోక్‌సభ స్థానం మరోసారి బీజేపీ ఖాతాలో పడనుందని యాక్సెస్ మై ఇండియా తన ఎగ్జిట్ పోల్‌లో స్పష్టం చేసింది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వరుసగా రెండో సారి గెలవనున్నారని తెలిపింది. ఈ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.ఎల్. శర్మ బరిలో నిలిచారు. అయితే ఈ ఇద్దరు మధ్య పోరు గట్టిగా జరిగినా.. విజయావకాశాలు మాత్రం స్మృతీ ఇరానీ వైపే ఉన్నాయని పేర్కొంది.

Also Read: ఈసీని కలిసిన ఇండియా కూటమి నేతలు


ఈ స్థానం నుంచి స్మృతీ ఇరానీ గెలవడం వల్ల ఉత్తర భారతంలో ఆ పార్టీ కొంత దెబ్బ తినే అవకాశముందంది. అమేఠీ లోక్‌సభ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో అంటే.. 2019లో ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన స్మృతీ ఇరానీ... 55 వేలకు పైగా ఓట్ల అధికత్యంతో రాహుల్ గాంధీపై గెలిచారు. ఇక అంతకు ముందు ఎన్నికల్లో అంటే.. 2014లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతీ ఇరానీ ఓడిపోయిన విషయం విధితమే.

Also Read: Arvind Kejriwal: తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేజ్రీవాల్


మరోవైపు అమేఠీ నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. మరోవైపు దశాబ్దాలుగా రాయబరేలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ.. ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ పారిపోయారంటూ ఎద్దేవా చేసింది.

Also Read: జూలో సీఎం యోగి ఆకస్మిక తనిఖీలు


అదీకాక కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ అప్పటికే నామినేషన్ వేశారు. అలాగే ఆ నియోజకవర్గం పోలింగ్ సైతం పూర్తి అయింది. దీంతో రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. వాయనాడ్‌లో సైతం రాహుల్ గాంధీ ఓటమి పాలవుతున్నారని ... అందుకే రాయబరేలీకి ఆయన వచ్చారంటూ బీజేపీ ఓ ప్రచారాన్ని ప్రారంభించింది.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 07:54 PM