Home » Sourav Ganguly
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేసి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) సరైన నిర్ణయం తీసుకుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు కలిగి ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన చెప్పాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. రూ.1.6 లక్షల విలువైన గంగూలీ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(sourav ganguly) బుధవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి(vishnu dev sai)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి చర్చించిన గంగూలీ సీఎంను క్రికెట్ విషయంలో సపోర్ట్ చేయాలని కోరినట్లు వెల్లడించారు.
రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో జరిగిన డ్రామా గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జట్టు పగ్గాలను స్వీకరించడానికి రోహిత్ ఇష్టపడలేదని.. అన్ని ఫార్మాట్లు ఆడుతుండటంతో ఆటగాడిగా తనపై చాలా ఒత్తిడి ఉందని చెప్పాడని గంగూలీ తెలిపాడు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పాకిస్థాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ఆడుతున్న సమయంలో పాకిస్థాన్ చాలా బాగా ఆడేదని.. ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదని కామెంట్ చేశాడు.
తొలి నాళ్లలో ధోని భారత జట్టుకు ఎలా ఎంపికయ్యాడనే విషయాలను నాటి బీసీసీఐ సెలెక్టర్ సబా కరీమ్ తెలిపాడు. ముఖ్యంగా 2004 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా నాటి టీమిండియా కెప్టెన్ గంగూలీకి ధోని గురించి చెప్పినట్లు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తూ నాటి పాక్ పర్యటనకు ధోని ఎంపిక కాలేదు. అయితే దీనికి గల ఆసక్తికర కారణాలను సబా కరీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
సౌరవ్ గంగూలీ. ఈ పేరు వినగానే అతని అద్భుత నాయకత్వ ప్రతిభ అందరికీ గుర్తొస్తుంది. దీంతోపాటు క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పి ఇంగ్లండ్‌కు గట్టి బుద్ది చెప్పిన ఘటనను ఎవరూ మరిచిపోలేరు. ఆ ఘటన ఎప్పుడూ గుర్తొచ్చిన భారత అభిమానులు ఉద్వేగానికి గురవుతంటారు. కాగా ఆ ఘటన జరిగిన నేటికి సరిగ్గా 21 ఏళ్లు పూర్తవుతుంది.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరిగే ప్రపంచకప్‌లో (2023 World Cup semi-finalists) సెమీ ఫైనల్ చేరే జట్లేవో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) చెప్పేశాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ చేరుకునే జట్లపై గంగూలీ తన అంచనాలను వెల్లడించాడు. తన అంచనా ప్రకారం మొత్తం 5 జట్లు సెమీస్ రేసులో ఉన్నట్లు పేర్కొన్నాడు.