Sourav Ganguly: వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ చేరే జట్లేవో చెప్పేసిన గంగూలీ
ABN , First Publish Date - 2023-07-09T11:11:13+05:30 IST
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరిగే ప్రపంచకప్‌లో (2023 World Cup semi-finalists) సెమీ ఫైనల్ చేరే జట్లేవో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) చెప్పేశాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ చేరుకునే జట్లపై గంగూలీ తన అంచనాలను వెల్లడించాడు. తన అంచనా ప్రకారం మొత్తం 5 జట్లు సెమీస్ రేసులో ఉన్నట్లు పేర్కొన్నాడు.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరిగే ప్రపంచకప్‌లో (2023 World Cup semi-finalists) సెమీ ఫైనల్ చేరే జట్లేవో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) చెప్పేశాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ చేరుకునే జట్లపై గంగూలీ తన అంచనాలను వెల్లడించాడు. తన అంచనా ప్రకారం మొత్తం 5 జట్లు సెమీస్ రేసులో ఉన్నట్లు పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు (Australia, England, India) సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఇక ప్రపంచకప్ టోర్నీలలో న్యూజిలాండ్‌ను (New Zealand) ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదని చెప్పుకొచ్చాడు. ఆ జట్టుకు కూడా సెమీస్ చేరే అవకాశాలున్నాయని అన్నాడు. అలాగే మెరుగ్గా ఆడితే పాకిస్థాన్(Pakistan) కూడా సెమీస్ చేరే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) తలపడాలని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా లీగ్ స్టేజ్‌లో భారత్, పాకిస్థాన్ పోరు అక్టోబర్ 15న జరగనుంది.
అదే సమయంలో నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ జట్టు ఓటమిపై కూడా గంగూలీ మాట్లాడాడు. టీమిండియా ఈ సారి గత రికార్డులను తారుమారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ సారి భారత జట్టు ఐసీసీ ట్రోఫీల కరువును తీరుస్తారని అంచనా వేశాడు. ఇటీవల ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓడినప్పటికీ ఫైనల్ చేరడాన్ని తక్కువగా అంచనా వేయలేమని చెప్పుకొచ్చాడు. ఫైనల్ చేరడం కూడా ఒక ఘనతే అని దాదా తెలిపాడు. ఇక జట్టుపై ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. గత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) 5 సెంచరీలు కొట్టినప్పుడు కూడా, అతడిపై ఒత్తిడి ఉండి ఉంటుందని అన్నాడు. ద్రావిడ్, రోహిత్, టీమిండియా ఒత్తిడిని అధిగమించి ప్రపంచకప్ గెలుస్తారనే నమ్మకం తనకు ఉందన్నాడు. రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) ఆడే రోజుల్లో కూడా అతడిపై ఒత్తిడి ఉండేదని, ఒత్తిడి అనేది సమస్య కాబోదని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 5 ట్రోఫీలు గెలిచాడని, అది అంత తేలిక కాదని, భారత కెప్టెన్‌గా కూడా ప్రపంచకప్ గెలుస్తాడని ఆశిస్తున్నట్లు గంగూలీ తెలిపాడు.