Home » South Africa
దక్షిణాఫ్రికాలో అతి పెద్ద నగరమైన జోహన్స్‌బర్గ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌లోని ఒక అతి పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవ దహనం కావడం శోచనీయం. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు.
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను ఇచ్చారు. భారత దేశ సంస్కృతి, వారసత్వాల ఔన్నత్యాన్ని ఈ బహుమతులు ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన సురహి కూడా ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న విషయం తెలిసిందే. జోహన్నస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొనడం కోసం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే.. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు మోదీ వెళ్లినప్పుడు..
బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. మీడియా సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ, జిన్‌పింగ్‌తో మోదీ ఏదో మాట్లాడారు.
బ్రిక్స్ జట్టులోకి మరో ఆరు దేశాలు చేరబోతున్నాయి. ఈ జట్టును విస్తరించేందుకు ప్రస్తుత సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, భారత దేశం, దక్షిణాఫ్రికా ఏకాభిప్రాయంతో అంగీకరించాయి. సభ్య దేశాల మధ్య సహకారం మరింత పెరగడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేశారు.
దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో భారత ప్రధాన నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు, త్రివర్ణ పతాకానికి ఇచ్చిన గౌరవం అందరి అభినందనలు అందుకుంటోంది. తాను నుంచోవలసిన స్థలంలో ఉన్న జాతీయ జెండాను ఏమాత్రం దాటకుండా చేతితో తీసుకుని తన జేబులో పదిలంగా ఉంచుకున్నారు.
జాతీయ పతాకం ప్రతి పౌరునికీ గర్వకారణం. దేశ జెండాను చూస్తే మనసంతా ఉత్తేజం నిండుతుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన మువ్వన్నెల జెండాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎల్లప్పుడూ ఎంతో గౌరవం ఇస్తారు.
ఇస్రో ప్రకటించినట్టుగా ఈనెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే క్షణాల కోసం యావద్దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 15వ బ్రిక్స్ సదస్సు-2023లో పాల్గొనేందుకు మంగళవారంనాడు దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సౌతాఫ్రికా నుంచే ''చంద్రయాన్-3'' వర్చువల్ ప్రోగ్రాంలో పాల్గోనున్నారు.
సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలను సృష్టిస్తున్న చైనాను భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) తీవ్రంగా ఎండగట్టారు. ఇరు దేశాలకు సరిహద్దుగా పరిగణిస్తున్న వాస్తవాధీన రేఖ (LAC) రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న పరిస్థితుల వల్ల పరస్పర వ్యూహాత్మక విశ్వాసం దెబ్బతిందని స్పష్టం చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ నికోల్‌ను అతడు వివాహమాడాడు. వీరి వివాహం శనివారం నాడు దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది.