Home » Sri Satyasai
శ్రీ సత్యసాయి జిల్లా: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలం బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టారని యోగేశ్వరి దేవిపై ఇదివరకే ఆరోపణలు వచ్చాయి.
Andhrapradesh: దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని భారీగా ఏర్పాట్లు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణను మంత్రి ఉషశ్రీ చరణ్ టార్గెట్ చేశారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల్లో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో కనిపించకూడదంటూ మంత్రి హుకుం జారీ చేశారు.
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రాయంలో మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి లేపాక్షి ఆలయానికి పీఎం చేరుకున్నారు.
Andhrapradesh: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. మోదీ పర్యటనలో మీడియాకు అనుమతి నిరాకరించారు. జిల్లా పర్యటనలో భాగంగా గోరంట్ల మండలం పాల సముద్రం వద్ద నాసిన్ అకాడమీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటన నేపథ్యంలో మీడియాను అనుమతించడంలేదు. గోరంట్ల మండలం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని రానున్న నేపథ్యంలో ఏపీ గవర్నర్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.
Andhrapradesh: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్‌ను ఎస్సీ సంఘం నేతలు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నా ఎస్సీ నా ఎస్టీ అని చెబుతూనే తమకున్న పథకాలను రద్దు చేశారంటూ మండిపడ్డారు.
Andhrapradesh: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ః ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ధర్మవరం మున్సిపల్ పరిధిలోని గుట్టుకిందపల్లి నుంచి పరిటాల శ్రీరామ్ పాదయాత్రను ప్రారంభించారు.