PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jan 16 , 2024 | 03:04 PM
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రాయంలో మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి లేపాక్షి ఆలయానికి పీఎం చేరుకున్నారు.
అమరావతి, జనవరి 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాసేపటి క్రితమే రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రాయంలో మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి లేపాక్షి ఆలయానికి పీఎం చేరుకున్నారు. మోదీకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లేపాక్షిలో వీరభద్రస్వామి, దుర్గా దేవిలకు ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయం విశిష్టతను లేపాక్షి శిల్పకళా సంపదను ప్రధానికి ఆలయ అధికారులు వివరించారు. శ్రీరామ భజనతో పాటు సంగీత కచేరిని మోదీ వీక్షించారు. శిల్ప కళా సంపదను లేపాక్షి స్థల పురాణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు. లేపాక్షి ఆలయం ప్రాంగణం చుట్టూ శిల్పకళా సంపదను ప్రధాని వీక్షించారు. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాటను మోదీ వీక్షించారు.
కాసేపట్లో సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రానికి మోదీ బయలుదేరి వెళ్లనున్నారు. పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ట్రైనీ ఐఆర్ఎస్‌లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అళాగే భూటాన్‌కు చెందిన రాయల్ సివీల్ సర్వీస్ విభాగ ఆఫీసర్ ట్రైనీస్‌తో కూడా ప్రధాని మోదీ ముచ్చటిస్తారు. సాయంత్రం 5:15 గంటలకు నాసిన్ నుంచి బయలుదేరి 5:40 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 5:40 నిమిషాలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..