Home » Srisailam
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
నంద్యాల: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆది దంపతులు సాయంత్రం గజ వాహనంలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో కన్నులపండువగా జరగుతున్నాయి. నాలుగవరోజు మయూరవాహనంలో స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం మయూరవాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
నంద్యాల: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు హంస వాహనంపై ఊరేగనున్నారు.
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో పెద్దిరాజు,చైర్మన్ దంపతులు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది.
నంద్యాల: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
నంద్యాల: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. 49 రోజులకు గాను 5 కోట్ల 62 లక్షల 30 వేల 472 రూపాయల ఆదాయం సమకూరింది. పటిష్ఠమైన భద్రత, సీసీ కెమెరాల పహారా మధ్య ఆలయ హుండీలను సిబ్బంది లెక్కించారు.
Andhrapradesh: శ్రీశైలం మల్లన్న పాదయాత్ర భక్తుల సౌకర్యాలను ఈఓ పెద్దిరాజు అడవి మార్గంలో పరిశీలించారు. నల్లమల అడవి ప్రాంతమైన నాగలూటి, పెద్దచెరువు తుమ్మబైలు అటవీ ప్రాంతాలలో మంచీరు, ఆహారం భక్తులకు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఈవో ఆదేశించారు.
Srisailam Brahmotsavam: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం(Srisailam) వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం బిగ్ అలర్ట్ న్యూస్. శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి(Maha Shivratri) బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు(Srisailam Temple EO) ప్రకటించారు.