Srisailam: శ్రీశైలం ఆలయంలో సామూహిక అభిషేకాలు రద్దు..
ABN , Publish Date - Mar 28 , 2024 | 07:03 AM
శ్రీశైలం ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
నంద్యాల: శ్రీశైలం (Srisailam) ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది (Ugadi) మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల అభిషేకాలు.. కుంకుమార్చన పూజలు నేటి నుంచే నిలిపివేశారు. శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ సేవా టికెట్లు స్వామి అమ్మవార్ల గర్భాలయ అభిషేకాలు.. సామూహిక అభిషేకాల టికెట్లు ఆన్ లైన్‌లో లేకపోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు.
ముందస్తుగా స్వామివారి గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించకపోవడమే గందరగోళానికి దారితీసింది. ఇవాళ్టి నుంచి స్వామివారి విఐపి బ్రేక్ దర్శనాలు (VIP Break Darshan).. స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలకు విడతలవారీగా భక్తులను అనుమతించనున్నారు. రోజుకు నాలుగు విడతలుగా ఏప్రిల్ 5 వరకు భక్తులకు అనుమతి లభించనుంది. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలం ఆలయంలో స్వామివారి స్పర్శ దర్శనాలు.. విఐపి బ్రేక్ దర్శనాలు కూడా దేవస్థానం రద్దు చేసింది. భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి లభించనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి దర్శనం వేళల్లో దేవస్థానం మార్పులు చేసింది.
నొక్కింది ఎంత.. బొక్కింది ఎంత!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.