SLBC Project: పదేళ్లలో 11.48 కిమీల సొరంగం తవ్వాం: హరీష్ రావు
ABN , Publish Date - Apr 19 , 2024 | 08:46 AM
శైలం(Srisailam) ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)(SLBC) ప్రాజెక్టును బీఆర్‌ఎస్(BRS) హయాంలో ప్రాధాన్యం లేని జాబితాలో చేర్చలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(సొరంగం)ను 11.48 కిలోమీటర్ల మేర..
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం(Srisailam) ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)(SLBC) ప్రాజెక్టును బీఆర్‌ఎస్(BRS) హయాంలో ప్రాధాన్యం లేని జాబితాలో చేర్చలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(సొరంగం)ను 11.48 కిలోమీటర్ల మేర తవ్వడం జరిగిందని వివరణ ఇస్తూ గురువారం ఓ ప్రకటన చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కోసం 43.93 కిమీల మేర టన్నెల్ తవ్వాల్సి ఉండగా 2014 దాకా 22.89 కిమీలు మాత్రమే తవ్వారని హరీశ్ తెలిపారు. టన్నెల్ నిర్మాణంలో ఆధునిక పద్ధతులు ఉన్నప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిని ఎంచుకోవడం వల్లే సకాలంలో పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురయ్యేదని, ఇందుకోసం విదేశాల నుంచి నిపుణులను తెప్పించాల్సిన పరిస్థితి ఉండేదని వివరించారు. అంతేకాక, శ్రీశైలంలో నిల్వలు పెరిగినప్పుడు ఈ టన్నెల్‌లోకి నీరు వచ్చి చేరుతుందని, ఆ నీటిని డీవాటరింగ్ చేసే క్రమంలో తవ్వకంలో జాప్యం జరిగిందని వివరించారు. నెలకు 300మీటర్లు కూడా తవ్వలేరనే విషయం తేటతెల్లమయిందని, నెలకు 200మీటర్లు తవ్వినా ఏడాదికి రెండున్నర కిలోమీటర్లు మాత్రమే తవ్వగలరని తెలిపారు.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..