Home » Srisailam
నంద్యాల జిల్లా: శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా 1వ తేదీ నుంచి 11 వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు స్పర్శ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్ది రాజు వెల్లడించారు.
Andhrapradesh: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీశాఖ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. మరికొద్ది రోజుల్లో శివరాత్రి పండుగ రాబోతోంది. దీంతో అనేకమంది భక్తులు కాలినడకన శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచే భక్తులు కాలినడకన వెళ్తుంటారు.
మహాకుంభాబిషేకం క్రతువులు ప్రత్యేక పూజలు శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు ఆలయంలో యాగాలు, హోమాలతో వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ, పండిరాధ్యులు కాశీ పీఠాధిపతి మల్లికార్జునమహాస్వామి మహాకుంభాబిషేకం పూజలలో పాల్గొనేందుకు శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు.
నంద్యాల జిల్లా: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రూ.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం మల్లన్నకు కానుకగా సమర్పిస్తారు.
శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతామని కలెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు,భద్రతపై 4 జిల్లాల అధికారులతో కలెక్టర్ శ్రీనివాసులు ఎస్పీ రఘువీర్ రెడ్డి శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
శ్రీశైలంలో పులిహోరలో మాంసపు ఎముక కలకలం సృష్టించింది. అయితే పులిహోరలో మాంసపు ఎముక ఉండటం మహా పాపమని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి అన్నారు.
నేడు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అధారిటీ ప్రతినిధులతోపాటు,కేఆర్ఎంబీ బృందం సందర్శించనుంది. మూడు రోజుల పాటు సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు, కేఆర్‌బీ బృందం శ్రీశైలంలోనే ఉండనుంది.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ఉదయమే శ్రీశైలం మండలం సున్నిపెంటకు లోకేష్ చేరుకున్నారు.
నంద్యాల జిల్లా: శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది.
Andhrapradesh: అయోధ్యలో మరికాసేపట్లో జరుగనున్న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి శ్రీశైలంలో వీక్షించనున్నారు. సోమవారం ఉదయం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని ఏపీ బీజేపీ చీఫ్ దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.