Srisailam: శ్రీశైలంలో పదోవరోజుకు చేరుకున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 10 , 2024 | 09:13 AM
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నాటికి పదోరోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరగనున్నాయి.
నంద్యాల: శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivaratri Brahmotsavalu) వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నాటికి పదోరోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరగనున్నాయి. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేయనున్నారు. కాగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. దైవ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది. భక్తులతో కిక్కిరిసిన ఆలయ క్యూలైన్లు.. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు వేకువ జామున నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కాగా 11న (సోమవారం) అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.