Srisailam: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. నేడు హంస వాహన సేవ..
ABN , Publish Date - Mar 03 , 2024 | 07:37 AM
నంద్యాల: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు హంస వాహనంపై ఊరేగనున్నారు.
నంద్యాల: శ్రీశైలం (Srisailam) మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు హంస వాహనంపై ఊరేగనున్నారు. కాగా ఈ నెల 1న శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ప్రారంభ పూజలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్యస్వామి, ఎం. విజయలక్ష్మి మతి సూరిశెట్టి మాధవీలత, ప్రత్యేక ఆహ్వానితులు బి. రామమోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు (Srisailam Temple EO) ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 8న పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. కాగా శివ స్వాములకు ఈ నెల 5 తేదీ వరకు విడతల వారీగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.